స్టార్ హీరోతో హెబ్బా పటేల్ రొమాన్స్

hebbaతెలుగులో ‘కుమారి 21ఎఫ్’ సినిమా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న బ్యూటీ హెబ్బా పటేల్. ఎంత మంచి గుర్తింపు వచ్చినా ఇప్పటి వరకు పెద్ద హీరోల సరసన నటించే అవకాశం రాలేదు. కానీ ఇప్పుడు ఈ అమ్మడు బంపరాఫర్ కొట్టేసినట్లు తెలుస్తోంది. తమిళ స్టార్ హీరో, ఇళయదలపతి విజయ్ సరసన నటించే అవకాశం కొట్టేసి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది హెబ్బా. అయితే ఇప్పటివరకు రాజ్‌తరుణ్, నిఖిల్ లాంటి హీరోలతో నటించిన ఈ బ్యూటీకి విజయ్ సరసన అవకాశం రావడం అదృష్టమనే చెప్పాలి.

విజయ్-మురుగదాస్ కాంబినేషన్‌లో ‘కత్తి’, ‘తుపాకి’ వంటి సూపర్ హిట్ సినిమాలు రూపొందాయి. మరోసారి వీరిద్దరు కలిసి పని చేస్తున్నారు. సినిమా మొదలుకాకుండానే దీనిపై అంచనాలు పెరిగిపోతున్నాయి. కథ ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు లేదా ముగ్గురు హీరోయిన్ల అవసరం ఉంటుందట. అందులో ఒకరిగా హెబ్బా పటేల్‌ను ఎంపిక చేసుకున్నారని సమాచారం. త్వరలోనే ఈ విషయంపై అధికార ప్రకటన వెలువడనుంది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy