స్టాలిన్ అరెస్ట్

Stalin-arrestడీఎంకే పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ ను అరెస్టు చేశారు తమిళనాడు పోలీసులు. అసెంబ్లీ నుంచి బలవంతంగా గెంటివేసినందుకు నిరసనగా మెరీనా బీచ్ లో నిరాహారదీక్షకు దిగారాయన. బీచ్ దగ్గరకు కార్యకర్తలు ఒక్కొక్కరుగా చేరుకోవడంతో  ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు భారీగా మొహరించడంతో… అక్కడ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. స్టాలిన్ తో పాటు కనిమొళి, దయానిధిమారన్ ఎంపీలు కూడా నిరసనలో పాల్గొన్నారు. అయితే దీక్ష చేస్తున్న ఎమ్మెల్యేలను ముందుగానే అక్కడ్నుంచి తరలించిన పోలీసులు… తర్వాత స్టాలిన్ ను అదుపులోకి తీసుకునేందుకు వచ్చారు. దీంతో నేతలు, కార్యకర్తలు… స్టాలిన్ ను చుట్టుముట్టి పోలీసులను అడ్డుకుంటున్నారు.

మెరీనాబీచ్ కు వెళ్లడానికి ముందు రాష్ట్ర ఇంచార్జి గవర్నర్ విద్యాసాగర్ రావుతో భేటీ అయ్యారు స్టాలిన్. సభలో తనకు అవమానం జరిగిందని కంప్లైంట్ చేశారు. స్పీకర్ సరిగా వ్యవహరించలేదంటూ వివరించారు. అంతకుముందు రాజ్ భవన్ ముందు డీఎంకే ఎమ్మెల్యేలు స్పీకర్ తీరుకు నిరసనగా ఆందోళన చేశారు. అన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామని గవర్నర్ చెప్పినట్లు డీఎంకే నేతలు వివరించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy