స్టూడెంట్స్ ఉద్యమం : ముంబై ట్రాఫిక్ అల్లకల్లోలం

Mumbai-Railway-trafficముంబై రవాణా వ్యవస్థ అల్లకల్లోలంగా మారింది. వేలాది మంది స్టూడెంట్స్ ఒక్కసారిగా రైల్వే ట్రాక్ పైకి వచ్చారు. ఎక్కడికక్కడ రైళ్లను అడ్డుకున్నారు. పట్టాలపై కూర్చుని నిరసన తెలుపుతున్నారు. ఇటీవల రైల్వేశాఖ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో రైల్వేలో అప్రెంటిస్ చేసిన వారికి 0శాతం రిజర్వేషన్ ప్రకటించింది. దీనిపై స్టూడెంట్స్ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 20శాతం కోటా ఎత్తేయాలని.. ఎగ్జామ్ లో మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొన్నాళ్లుగా దీనిపై స్టూడెంట్స్ ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోవటంతో.. మార్చి 20వ తేదీ ఉదయం 7 గంటల నుంచి స్టూడెంట్స్ పెద్ద ఎత్తున బయటకు వచ్చారు. రైల్వే ట్రాక్ లపై నిరసనకి దిగారు. కోటా ఎత్తేసి.. ఎగ్జామ్ మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ముంబై ట్రాఫిక్ అల్లకల్లోలం :

ముంబై ట్రాన్స్ పోర్ట్ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేంది లోకల్ రైళ్లు. ఒక్క నిమిషం రైళ్లు రాకపోకలు ఆలస్యం అయితే రద్దీ అంతకంతకూ పెరిగిపోతుంది. అదే ఓ గంట లోకల్ రైళ్లు ఆగిపోయాయి అంటే.. ముంబై రవాణా వ్యవస్థ మొత్తం గందరగోళం, గజిబిజి అవుతోంది. లోకల్ రైళ్లలో ప్రయాణించే లక్షల మంది బస్సులు, వ్యక్తిగత వాహనాలతో రోడ్లపైకి వస్తారు. దీంతో ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం ముంబై ఇలాగే ఉంది. మతుంగ – ఛత్రపతి శివాజీ రైల్వే టెర్మినల్ మధ్య లోకల్ రైళ్లు నిలిచిపోయాయి. ఈ రూట్లలోఉదయం 7 గంటల నుంచి ఎక్కడి రైళ్లు అక్కడే ఆగిపోయాయి. దీంతో మొత్తం ట్రాఫిక్ గందరగోళంలో పడింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy