స్టెప్పులతో అదరగొట్టిన చర్చి ఫాదర్

Priest dance Keralaచర్చి ఫాదర్ అంటే.. మంచి చెడులు చెబుతూ… భగవంతుని బోధనలు అందరికీ వినిపిస్తుంటారు. అయితే కొంత మంది.. అక్కడితో పరిమితమైపోరు. ఇప్పటి కుర్రకారులో జోష్ తెప్పించేందుకు.. వాళ్లను సరైన దారిలో పెట్టేందుకు.. వాళ్లతో కలిసిపోతుంటారు. దీనికి ఉదాహరణ.. కేరళకు చెందిన మెర్టన్ డి సిల్వా. ఆయన బోధనలే కాదు… ఆయన డ్యాన్స్ కూడా అదుర్స్ అంటున్నారు. జూన్ 27న జరిగిన ఓ యూత్ ప్రోగ్రాంలో ఆయన కుర్రకారుతో కలిసి వేసిన స్టెప్స్ అందరనీ కట్టిపడేస్తున్నాయి. పిల్లల కంటే ఆయనే బెటర్ గా డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను ఎవరో ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 23 లక్షల మంది ఈ వీడియోను చూశారు. ఇంకా వైరల్ అవుతూనే ఉంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy