స్టేషన్ లో సెటిల్ మెంట్లు కుదరదు

first-information-reportFIR…. ఫస్ట్ ఇన్ఫర్ మేషన్ రిపోర్ట్. స్టేషన్ లో కేసులు ఫైల్ చేయించుకోవాలంటే బాధితుతలకు ప్రహసనం. పోలీసులకు తలకు మించిన భారం. ఫైల్ చేస్తే ఒక హెడెక్. చేయపోతే మరో తలనొప్పి. అందుకే చాలా కేసులు FIRలోకి చేరకుండానే సెటిల్ అవుతుంటాయి. ఇకపై అలా కుదరదంటోంది కేంద్రం. బాధితుడు ఏ రూపంలో ఫిర్యాదు చేసిన కేసును రిజిస్టర్ చేయాల్సిందేనని ఆదేశించింది.

స్టేషన్లలోనే సెటిల్ మెంట్లు. రెండు పార్టీలను పిలిచి మాట్లాడుకొని పరిష్కరించుకోమని సలహాలు. కేసు ఫైల్ చేస్తే కొలిక్కి తేవాల్సిన పరిస్థితి. చేయకపోతే నేరాలు పెరుగుతాయన్న భావన. పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ నమోదుపై ఎన్నెన్నో ట్విస్టులుంటాయి. వాటి చుట్టూ రాజకీయకోణాలు, పోలీసులు సొంత ప్రయోజాలు ఎన్నెన్నో రహస్యాలుంటాయి.

ఎఫ్ఐఆర్ లు ఎక్కువగా నమోదైతే ఆ స్టేషన్ పరిధిలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో లేదని… తక్కువ కేసులు రిజిస్టర్ అయితే… శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని భావిస్తుంటారు. వాటిని పక్కనపెడితే చిన్న చిన్న దొంగతనాలు, గొడవలు, కొట్లాటలు.. ప్రతీదానికి స్టేషన్ మెట్లెక్కే చిల్లరగాళ్లకు లెక్కుండదు. అలాంటి వాటిపై FIR ఫైల్ చేయకుండానే సెటిల్ చేస్తుంటారు పోలీసులు. ఎఫ్ఐఆర్ ని ఫైల్ చేసినా… చేయకపోయినా అంతా స్టేషన్ హౌజ్ ఆఫీసర్ విచక్షణకే వదిలేస్తుంటాం. ఒక్కోసారి కేసు ఫైల్ చేయించుకోవాలంటే… పైరవీలు చేయించుకోవాల్సిన దుస్థితి బాధితులది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని FIRని నమోదుచేయాలో వద్దో తేల్చుకోలేని డైలమాలో పడిపోతుంటారు పోలీసులు. కానీ ఇకపై అలా కుదరదు. ఫస్ట్ ఇన్ ఫర్మేషన్ రిపోర్ట్ ని ఫైల్ చేయాల్సిందేని అన్ని రాష్ట్రాలకు ఆర్డరేసింది కేంద్రం. ఘటన చిన్నదైనా పెద్దదైనా కేసు నమోదుచేయకపోతే నిందితుడు తప్పించుకుంటాడని.. మరిన్ని నేరాలు పెరిగే ప్రమాదముందన్నది కేంద్రం భావన. అయితే తనకు జరిగిన అన్యాయాన్ని స్టేషన్ కొచ్చి చెప్పుకుని.. న్యాయం పొందే హక్కు ప్రతి బాధితుడికీ ఉంటుంది. ఇకపై బాధితులెవరైనా.. ఫోన్ ద్వారా, లెటర్ ద్వారా… స్టేషన్ కొచ్చి కేసు పెట్టాలనుకున్నా.. కేసున రిజిస్టర్ చేయాల్సిందేనన్నది కేంద్రం ఆదేశం. లేకపోతే సదరు పోలీసులపై చర్యలు తప్పవని హెచ్చరించింది. నిజానికి చాలాకేసుల్ని తమ పరిధిలోకి రాదని ఫైల్ చేయకుండా వదిలేస్తుంటారు పోలీసులు. ఇకపై అలా కుదరదంటోంది కేంద్రం. కేసును రిజిస్టర్ చేయడంలో డిలే చేస్తే సీరియస్ యాక్షన్ తప్పదంటోంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy