స్టోక్స్ సెంచరీ.. పూణేకు విక్టరీ

benstokesరైజింగ్ పూణే సూపర్ జెయింట్ సంచలన విజయం సాధించింది. బెన్‌స్టోక్స్ (103 నాటౌట్) సూపర్ సెంచరీతో  5 వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టులో ఓపెనర్లు మెక్‌కలమ్ (45), ఇషాన్ కిషన్ (31) నిలకడగా ఆడినా.. మిడిలార్డర్ విఫలమవడంతో ఆ జట్టు 19.5 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనకి దిగిన పూణేని ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే గుజరాత్ బౌలర్ సంగ్వాన్ దెబ్బతీశాడు. రెండు బంతుల వ్యవధిలోనే అజింక్య రహానె (4), కెప్టెన్ స్టీవ్ స్మిత్ (4)‌ని ఔట్ చేశాడు. అనంతరం వచ్చిన మనోజ్ తివారీ‌ని అద్భుతమైన బంతితో థంపీ పెవిలియన్‌కి పంపగా.. లేని పరుగు కోసం ప్రయత్నించి మరో ఓపెనర్ రాహుల్ త్రిపాఠి (4) రనౌటయ్యాడు. దీంతో 5.3 ఓవర్లు ముగిసే సమయానికి పుణె 42/4తో పీకల్లోతు కష్టాల్లో నిలిచింది. ఈ దశలో ధోని (26), బెన్‌స్టోక్స్ మ్యాచ్ ను నిలబెట్టారు. చివరి వరకు ఆడిన స్టోక్స్.. క్రిస్టియాన్ (17 నాటౌట్) తో కలిసి పూణేకు విజయాన్ని అందిచాడు. సిక్స్‌ బాది గెలుపు లాంఛనాన్ని167/5తో పూర్తి చేశాడు క్రిస్టియాన్. టోర్నీలో ఆరో గెలుపు అందుకున్న పూణే పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy