స్తంభంపైనే కరెంట్ ఉద్యోగి కన్నుమూత

currentకరెంట్ షాక్ తో  విద్యుత్‌శాఖ కాంట్రాక్టు ఉద్యోగి మరణించాడు. ఈ ఘటన నారాయణఖేడ్‌ మండలం గంగాపూర్‌ శివారులో శనివారం రాత్రి జరిగింది. తుర్కవడ్‌గాం గ్రామానికి చెందిన లడ్డ జనార్దన్‌.. కరెంట్ పనులు చేస్తుండగా షాక్ తో చనిపోయాడు.  ర్యాకల్‌ 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ పరిధిలోని గంగాపూర్‌ శివారులో 11 కేవీ లైన్‌ మరమ్మతుల విషయమై లైన్‌మన్‌ వెంకటయ్య.. జనార్దన్‌ను స్తంభం ఎక్కించి పనులు చేయిస్తున్నారు. అయితే అంతలోనే విద్యుత్‌ సరఫరా జరిగి అతను అక్కడికక్కడే మరణించాడు. విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే జనార్దన్‌ మరణించాడని గ్రామస్తులు ఆందోళన చేశారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుని మృతుడి కుటుంబానికి నష్టపరిహారం, ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేందర్‌ వివరించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy