
వాహనాలు పెరగడంతో డ్రైవర్లకు తగ్గతున్న ఆదాయం
నగరంలో నాలుగేళ్ల క్రితం ఓలా, ఉబర్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. డ్రైవర్లకు మొదట్లో భారీగా ఆదాయం లభించింది. ప్రోత్సాహకాలు, కమిషన్లు తదితర రూపాల్లో నెలకు రూ.60 వేలకుపైగా ఆర్జించారు. అప్పట్లో ఉబర్‌లో 10 వేల వాహనాలు, ఓలాలో మరో 5 వేల వాహనాలు ఉండేవి. గత రెండేళ్లలో వాహనాల సంఖ్య సుమారు 1.5 లక్షలకు చేరింది. ఓలా, ఉబర్ క్రమంగా కమీషన్లు, రాయితీలు, ప్రోత్సాహకాల్లో కోత విధించాయి. ఏడాది క్రితం నెలకు కనీసం రూ.40 వేలు సంపాదించిన డ్రైవర్లు.. ఇప్పుడు రూ.25 వేలు కూడా సంపాదించలేకపోతున్నట్లు తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవీ డిమాండ్లు..
.. ఓలా, ఉబర్ సంస్థల స్థానంలో డ్రైవర్ల అసోసియేషన్‌ను గుర్తించి వారే స్వయంగా నిర్వహించుకునేలా ఒక యాప్‌ను రూపొందించి ఇవ్వాలి.
.. అంతర్జాతీయ క్యాబ్ సంస్థలు ప్రభుత్వానికి 5% కమీషన్ చెల్లిస్తుండగా తాము 10% చెల్లించేందుకు అను మతివ్వాలి.
.. ఫైనాన్షియర్ల వేధింపుల నుంచి విముక్తి కల్పించాలి.
.. ఆత్మహత్యలకు పాల్పడిన డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలి.