స్నేక్ వైన్.. బ్లడ్ సూప్..!

పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి..! ఈ సామెత ఎక్కడో విన్నట్లుంది కదా..? ఎవరైనా మరీ డిఫరెంట్ గా ఉన్నపుడూ.. అందరు చేసే దానికి పూర్తి రివర్స్ లో ఆలోచించే వాళ్లనుద్దేశించి ఈ సామెత వాడుతుంటారు. అయితే ఇప్పుడు మేము చెప్పే ఈ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ గురించి చదివితే.. ఈ సామెత వీళ్ల కోసమే కనిపెట్టారని అనుకుంటారు. ఎందుకంటే.. ప్రపంచంలోనే అతి భయంకరమైన ఫుడ్ ఐటమ్స్ ఈ జనాలు తీసుకుంటుంటారు. అవి చూస్తే తినడం తర్వాతి సంగతి కాని.. భయం మాత్రం ఖచ్చితంగా అవుతుంది. అవేవో మీరే చూడండి..

snake-wine-thinkstockస్నేక్ వైన్ :

ఆల్కహాల్ తాగేవారు మరింత డిఫరెంట్ గా ఆలోచించి.. స్నేక్ వైన్ తయారు చేశారట. రైస్ వైన్ లో లేదా ధాన్యంతో తయారు చేసిన ఆల్కహాల్ లో పాములను నానబెట్టి తాగుతారు. చైనా, వియత్నాం.. సౌత్ ఈస్ట్ ఏరియాలో ఈ వైన్ తాగుతుంటారు.

 

blood-soup_medబ్లడ్ సూప్ :

షాంఘై, పోలాండ్, ఫిలిప్పీన్స్, కొరియా, సింగిపూర్ దేశాల్లో కోళ్లు, బాతులు, పందులు, పశువుల బ్లడ్ తో సూప్ తయారు చేస్తుంటారు. చూడ్డానికే ఇబ్బందిగా ఉండే ఈ సూప్ ను వాళ్లు మాత్రం లట్టీలు కొట్టుకుంటూ తాగుతారట.

 

 

fruitbat-soup_medఫ్రూట్ బ్యాట్ సూప్ :

గబ్బిలాల గురించి తెలుసు కదా. గబ్బిలాలను, పండ్ల రసాలతో కలిసి సూప్ గా చేసుకొని పలావ్ ప్రాంతంలో తాగుతుంటారు. ఇది తాగాలంటే చాలా ధైర్యం ఉండాలి.

 

 

 

sannakji_medసన్నాక్జి :

సన్నాక్జి అనేది కొరియన్ డిష్. బతికున్న ఆక్టోపస్ లను చిన్న చిన్న పీస్ లుగా కట్ చేసి పచ్చి గానే తింటారు. అప్పుడే కట్ చేసి ఉండటం వల్ల ప్రాణం పోని ఆ ముక్కలు కదులుతుంటాయి. అయినా ఆరగిస్తుంటారు అక్కడి భోజన ప్రియులు.

 

 

 

scorp-pops_medస్కార్పియాన్ చాకొలెట్స్ :

తేలుతో చాకొలెట్స్ ఏంట్రా బాబు అనుకుంటున్నారా..? తేలును మధ్యలో ఉంచి లాలి పాప్ లు తయారు చేస్తారు. ఇవి చాలా స్వీట్ గా ఉంటాయని చెబుతుంటారు.

 

 

smalahove_medస్మలహొవ్ :

స్మలహొవ్ అనేది వెస్ట్రన్ నార్వే డిష్. గొర్రె తలను ఉడికించి లేదా, స్టీమ్ చేసి దానికి మరిన్ని ఐటమ్స్ తో కలతిపి తింటుంటారు. జనరల్ గా క్రిస్మస్ కు ముందు ఈ ఫుడ్ బాగా తింటుంటారు.

 

 

tuna-eyeballs_medటూనా ఐబాల్స్ :

టూనా ఫిష్ నుంచి ఈ డిష్ ను తయారు చేస్తారు. టూనా ఫిష్ కనుగుడ్లను ఉడికించి తింటుంటారు. చైనా, జపాన్ లో బాగా ఇష్టపడతారు.

 

balut_medబాలుట్ :

బాతు గుడ్లలో అప్పుడప్పుడే పిండం తయారవుతున్న గుడ్లను ఉడకబెట్టి తినడం ఫిలిప్పీన్ వాసులకు భలే ఇష్ట పడతారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy