స్పీకర్ నిర్ణయంపై కోర్టుకు వెళ్ళనున్న కాంగ్రెస్

congressఅసెంబ్లీలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌, సభ్యత్వ రద్దుపై ఆ పార్టీ నాయకులు హైకోర్టును ఆశ్రయించనున్నారు. మార్చి-14, బుధవారం రోజు  హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయాలని నిర్ణయించారు కాంగ్రెస్ నేతలు.

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగం సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెడ్‌ఫోన్ విసరడంతో శాసనమండలి ఛైర్మెన్ స్వామిగౌడ్‌ కంటికి గాయమైంది. శాసనమండలి చైర్మెన్ స్వామిగౌడ్‌‌ను గాయపర్చినందుకు.. కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్‌ శాసనసభ్యత్వాలను రద్దు చేస్తూ మంగళవారం(మార్చి-13) స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.  తెలంగాణ అసెంబ్లీలో జరిగిన పరిణామాల క్రమంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy