సర్దార్ గబ్బర్‌సింగ్ ఐటమ్ సాంగ్

CQW7M5rWEAA5i9A‘సర్దార్ గబ్బర్‌సింగ్’ మూవీ షూటింగ్ స్పీడందుకుంది. న్యూ కెమెరామన్ సెట్స్‌లోకి రావడంతో ఐటెమ్‌సాంగ్‌ షూటింగ్ జరుగుతోంది. పవన్‌తో శాండిల్‌వుడ్ బ్యూటీ లక్ష్మీరాయ్‌తో ఇరగదీసే స్టెప్స్ వేసిందని యూనిట్ టాక్. ఈ సాంగ్‌కు సంబంధించి కొన్ని స్టిల్స్ ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. తనదైన శైలిలో కనిపించిన పవన్.. ఖాకీ డ్రెస్‌, నెక్‌కి రెడ్ టవల్, చేతికి గుబాలించే మల్లెలతో ఫస్ట్ టైం పవన్ సెల్పీలో కనిపించాడు

 

 

CQW7MvIWEAAoM59ఇక లక్ష్మీరాయ్ కూడా ఆడియన్స్ కోరుకునే విధంగా డిఫరెంట్‌గా కనిపించింది. నానక్ రామ్‌గూడ‌లోని రామానాయుడు స్టూడియోలో ఈ సాంగ్ షూట్ జరుగుతోంది. ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ అద్భుతంగా సెట్ వేశాడు. ఇంకోవైపు ఐటెమ్‌సాంగ్ ఓ రేంజ్‌లో వుంటుందనే క్యాంపెయిన్ పవర్ స్టార్ ఫ్యాన్స్ మొదలెట్టేశారు. ఏదైతేనేం.. ‘సర్దార్‌’పై వస్తున్న డిఫరెంట్ గాసిప్స్‌కు పవన్ ఈ విధంగా ఫుల్‌స్టాప్ పెట్టాడని అంటున్నారు.

CQW7N7BW8AQYqWm

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy