స్పీడ్ లాక్: ఔటర్ పై ‘వందే’

Outer-ring-roadరోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు.. నిబంధనలు కట్టుదిట్టం చేశారు ట్రాఫిక్ పోలీసులు. యాక్సిడెంట్లకు మితిమీరిన వేగమే కారణమని …దాన్ని కంట్రోల్ చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పై వాహనాల జెట్‌ స్పీడ్‌కు కళ్లెం వేశారు. ఓఆర్‌ఆర్‌పై అమల్లో ఉన్న అధిక వేగం గంటకు 120 కిలోమీటర్లను 100 కిలోమీటర్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఓఆర్‌ఆర్‌లో ప్రయాణించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు సూచనలు చేశారు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌ శాండిల్యా.రూల్స్ అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వాహనాలను ORR పై గల నాలుగు లేన్లలో నిలుపరాదు. అత్యవసర పరిస్థితుల్లో వాహనాలు నిలిపేందుకు కొంత వెసులుబాటు కల్పించారు. ఈ వాహనాలు పూర్తిగా ఎడమవైపు అత్యవసర లేన్‌పైనే ఆపాలి. ఇతర వాహనాలకు కనపడేందుకు వీలుగా పార్కింగ్‌ లైట్లను వేసుకోవాలి. వాహనం ముందు, వెనుక వైపు ఐదు మీటర్ల దూరంలో రేడియం గుర్తులు పెట్టాలి. ORR స్ట్రెచ్‌ మార్గంలో పాదచారులు కూడా నడవొవద్దని నిషేధం విధించారు. రూ.52 లక్షల వ్యయంతో HMDA అందించిన 5 స్పీడ్‌ లేజర్‌ గన్‌ కెమెరాలు, 13 బ్రీత్‌ అనలైజర్లతో పోలీసులు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను పెంచనున్నారు.
హైవే ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌(HTMS) ద్వారా ప్రతిదీ పర్యవేక్షించడంతో పాటు ప్రమాదాలు నియంత్రించేలా.. వాహనదారులు లేన్‌ డిసిప్లేన్‌ పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఢిల్లీ, నోయిడా మాదిరిగా ORR  ఎంట్రీ నుంచి ఎగ్జిట్‌ వరకు వాహనం వేగం నిబంధనలు అతిక్రమిస్తే ఎగ్జిట్‌ దగ్గర ఆ వాహనదారుడి చేతికి చలాన్‌ అందించనున్నారు. మరో ఏడు నెలల్లో అందుబాటులోకి రానున్న హెచ్‌ఎంటీఎస్‌తో ఓఆర్‌ఆర్‌ను ప్రమాదరహితంగా మార్చే వీలుందని అధికారులు చెబుతున్నారు.

ORR పై కుడివైపు గల లేన్‌–1, లేన్‌–2ల్లో వాహనాల గరిష్ట వేగం గంటకు 100 కి.మీ. కనిష్ట వేగం గంటకు 80 కి.మీ. లేన్‌–3, లేన్‌–4ల్లో గరిష్ట వేగం 80 కి.మీ. కనిష్ట వేగం గంటకు 40 కి.మీ. వేగంతో వాహనాలు వెళ్లాలి. భారీ వాహనాలు లేన్‌–3, లేన్‌–4లో మాత్రమే వెళ్లాలి. గంటకు 40 కి.మీ. కన్నా తక్కువ వేగంతో నడిచే వాహనాలను ఓఆర్‌ఆర్‌పై అనుమతించరు. నిర్దేశించిన వేగాన్ని అధిగమించిన వాహనాలపై స్పీడ్‌ లేజర్‌ గన్‌ కెమెరాల నిఘాతో జరిమానా విధిస్తారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy