స్పెయిన్‌లో ఉగ్ర దాడి..13 మంది మృతి

spainస్పెయిన్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రెండు ప్రాంతాల్లో దాడికి తెగబడ్డారు. గురువారం (ఆగస్టు 17) సాయంత్రం టూరిస్ట్ స్పాట్ బార్సిలోనాలో దాడికి దిగిన ఉగ్రవాదులు…అదే తరహాలో శుక్రవారం  (ఆగస్టు18) ఉదయం కామ్ బ్రిల్స్ లోనూ దాడికి ప్రయత్నించారు. వ్యానున్ ప్రజల పైకి తీస్కెళ్లారు. ఈ దాడిలో ఆరుగురితోపాటు ఓ పోలీసుకు గాయాలయ్యాయి. వెంటనే అలర్టైన స్పెయిన్ పోలీసులు…వారిని ఆగిపోవాంటూ హెచ్చరించారు. అయినా విన్పించుకోక పోవడంతో కాల్పులు జరిపారు. పోలీసు కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు చనిపోయారు. అయితే బార్సిలోనాకు 130 కిలో మీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది.

గురువారం (ఆగస్టు 17) సాయంత్రం టూరిస్ట్ స్పాట్ బార్సిలోనాలో దాడికి దిగారు ఉగ్రవాదులు. లాస్ రాంబ్లాస్ లో ఫుట్ పాత్ పై నడుచుకుంటూ వెళ్తున్న వారిపై వ్యాన్ తో దూస్కుకెళ్లారు. ఈ ఘటనలో 13 మంది చనిపోగా మరో 50 మందికి గాయాలయ్యాయి. వ్యాన్ తో ఢీ కొట్టిన ఉగ్రవాదులు.. పారిపోయి పక్కనే ఉన్న ఓ హోటల్ లో దాక్కుకున్నట్లు.. ప్రత్యక్ష సాక్షులుపోలీసులకు  తెలిపారు. దీంతో ఉగ్రవాదులు దాక్కున్న హోటల్ ను చుట్టుముట్టారు. మరోవైపు ఈ దాడి చేసింది తామేనని ప్రకటించుకుంది ISIS. అయితే ఈ ఘటనలో చనిపోయిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశముందంటున్నారు పోలీసులు.

లాస్ రాంబ్లాస్ దాడితో చుట్టుపక్క ప్రాంతాలను ఖాళీ చేయించారు పోలీసులు. ప్రజలు  బయట తిరగవద్దని ఆదేశాలు జారీ చేశారు. బార్సిలోనాల మెట్రోతో పాటు రాకపోకలను నిలిపేశారు. ఈ దాడితోని స్పెయిన్ తో సహా యూరప్ దేశాలన్నీ అలర్ట్ అయ్యాయి. బార్సిలోనా దాడిని ఖండించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్,. బాధితుల్లో భారతీయులెవరూ లేరని సుష్మా ట్వీట్ చేశారు. స్పెయిన్ లోని ఇండియన్ ఎంబసీతో మాట్లాడినట్లు తెలిపారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy