స్పెయిన్ లో బీభత్సం సృష్టించిన సునామీ

స్పెయిన్ దేశంలో టూరిజానికి ప్రసిద్ధిగాంచిన మజోర్కా, మెనోర్కా ద్వీపాల బీచ్‌ లపై మంగళవారం (జూలై-17) సునామీ విరుచుకుపడింది. మెనోర్కా పశ్చిమ తీరంలో గల సిటడెల్లా బీచ్ వద్ద ఆరు అడుగులు ఎత్తైన అలలు తీరాన్ని తాకాయి. దీంతో యాత్రికులు బెంబేలెత్తిపోయారు. సిటడెల్లాతో పాటు దగ్గరలోని పలు బీచ్‌ లపై సైతం మినీ సునామీ ప్రభావం కనిపించింది.

భీకర గాలుల కారణంగానే తీరంపైకి భారీ అలలు వచ్చినట్లు చెప్పారు నిపుణులు. దీన్ని శాస్త్రీయ పరిభాషలో మెటిరియలాజికల్‌ సునామీగా పిలుస్తారని వెల్లడించారు. పెనుగాలుల తాకిడికి నీటిపై అధిక ఒత్తిడి కలిగి భారీ ఎత్తున అలలు ఎగసిపడతాయని వివరించారు. దీన్నే వాతావరణ ప్రేరిత సునామీగా చెప్పొచ్చని తెలిపారు. అయితే, అల ఎంత ఎత్తుకు ఎగసేది సదరు ప్రదేశంలో ఉన్న లోతును బట్టి ఉంటుందని చెప్పారు.

ఈ తరహా సునామీలు తరచుగా మధ్యదరా సముద్రంలో సంభవిస్తుంటాయి. బ్రిటన్‌ తీరంలోనూ కనిపిస్తుంటాయి. స్పెయిన్‌ తీరంలో వచ్చిన మినీ సునామీ ధాటికి తీరంలో ఉన్న రిసార్టులు, బార్లలోకి నీరు చొచ్చుకెళ్లింది. కొన్ని చోట్ల సముద్రపు నీరు రోడ్లపైకి చేరింది. తీరంలో ఉన్న బోట్లను రక్షించుకునేందుకు యజమానులు పడరానిపాట్లు పడ్డారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy