స్పేస్ సెంటర్ దగ్గరలో ఏలియన్స్

iss-aliensఅనంత విశ్వంలో కంటికి కనబడని రహస్యాలెన్నో.. భూమిపై నివసించే మానవులతోపాటు ఏదో ఒక గ్రహంపై అంతుచిక్కని గ్రహాంతరవాసులు కూడా జీవిస్తున్నారన్నతి అంతరిక్ష పరిశోధకుల మాట. ఈ గ్రహాంతరవాసుల సమాచారాన్ని తెలుసుకునేందుకు అమెరికా, రష్యా, చైనా, యూకే, ప్రాన్స్ దేశాలతోపాటు మరికొన్ని దేశాలు లక్షల కోట్లతో పరిశోధనలు సాగిస్తున్నారు.

తాజాగా నాసాకు చెందిన అంతర్జాతీయ స్పేస్ సెంటర్(ISS) వీడియో ఫుటేజ్ లో అంతుచిక్కని ఆరు ఏలియన్స్ కనిపించాయి. అయితే నాసా ఆ ఫుటేజ్ ని ఎడిట్ చేసి.. అలాంటిదేమి లేదని బుకాయిస్తోందన్నారు గ్రహాంతరవాసులపై సుదీర్ఘంగా పరిశోధనలుగావిస్తున్న ఖగోళ శాస్త్రవేత్తలు.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం రికార్డ్ చేసిన ఫుటేజ్ లో గమనిస్తే..36 సెకన్లపాటు చీకటిలోంచి ఆరు ఏలియన్స్ ISS కేంద్రం దగ్గర నుంచి వెళ్లాయి. వీడియో లింక్ లో వీటిని గమనించొచ్చంటున్నారు ఖగొళ పరిశోధకులు. ఫుటేజ్ ను పరిశీలిస్తుండగా 25 సెకండ్లపాటు ఏలియన్స్ కనిపించాయని.. అవి చాలా పెద్దగా కనిపించాయని చెప్పారు పరిశోధకులు.

కానీ నాసా శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని కొట్టిపారేస్తున్నారు. ఐస్ క్రిస్టల్ మాదిరిగా కనబడే అవి స్పేస్ డ్రాండ్రఫ్ లాంటివన్నారు. అంతరిక్ష వ్యర్థాలు అని అర్థం. 1980లో ఎస్ టీఎస్ 75 అనే శాటిలైట్ పేలిపోయిందని.. దాని అవశేషాలై ఉండొచ్చంటున్నారు వీళ్లు. అంతరిక్షంలో ఏలియన్స్ తిరుగుతున్నాయన్న నిజం ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారో వేచిచూడాల్సిందే.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy