స్మార్ట్ గా అంగన్ వాడీ సేవలు

  • పౌష్టికాహారం సక్రమంగా అందేలా చర్యలు
  • హైదరాబాద్ లోని 914 మంది టీచర్లకు స్మార్ట్ ఫోన్లు
  • ఎప్పటికప్పడు అప్ డేట్ చేసేలా కొనసాగుతున్న శిక్షణ

అంగన్‌ వాడీలను ఆధునికీకరించేందుకు సర్కారు సిబ్బంది చేతికి స్మార్ట్‌ ఫోన్లు ఇస్తోంది. మెయిన్​గా అంగన్‌ వాడీల పరిధిలో ఆహార దుర్వినియోగం జరుగుతుందనే ఆరోపణలుంటున్నాయి. వాటికి చెక్‌ పెట్టి పిల్లలు, మహిళలు, గర్భిణులకు పౌష్టికాహారం అందజేసేందుకు వీలుగా ఈ స్మార్ట్‌ ఫోన్లు ఉపయోగపడనున్నాయి. జాతీయ పోషణ అభియాన్‌ లో భాగంగా 914 మంది అంగన్‌ వాడీ టీచర్లకు ప్రభుత్వం స్మార్ట్‌ ఫోన్లు అందజేసింది. మొదటగా హైదరాబాద్‌ జిల్లాలో అందుబాటులోకి తెచ్చి టీచర్లకు ప్రత్యేకంగా ట్రైయినింగ్‌ కూడా ఇస్తున్నారు.

సీడీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కామన్‌ కేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎల్‌ టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాఫ్ట్‌ వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(common care lts) అనే యాప్‌ ద్వారా లాంగ్‌ టర్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సపోర్టు ఇచ్చేలా దీన్ని రూపొందించారు. ఫోన్‌ తోపాటు పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాంక్‌ , నెట్‌ సేవల కోసం ఐడియా సిమ్‌ కార్డు ను అందజేశారు. ఈ యాప్‌ లో 7 రకాల రిజిస్టర్లను రూపొందించారు. కుటుంబ నిర్వహణ, రోజువారి న్యూట్రిషన్‌, గృహ సందర్శన, ప్రణాళిక, పిల్లల పెరుగుదల పర్యవేక్షణ, టీహెచ్‌ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డ్యూలిస్ట్‌ , అంగన్‌ వాడీ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహణ, ఎంపీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనే మ్యాడ్యుల్స్‌ ఉన్నాయి.

ఇందులో ఏడీడబ్ల్యూ చేసే పనులను మోడల్‌ లెవల్‌ లో ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారు. కిందస్థా యి నుంచి ఉన్నత స్థాయిలో ఉన్న అధికారుల వరకు అంగన్‌ వాడీల పనితీరును పర్యవేక్షించవచ్చు. ముఖ్యం గా ఆహార దుర్వినియోగాన్ని తగ్గించడానికి యాప్​ సేవలు ఉపయోగపడున్నాయని జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు.

కుటుంబ నిర్వహణపై..

జిల్లాలో చార్మినార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గోల్కొండ, ఖైరతాబాద్‌ , నాంపల్లి, సికింద్రాబాద్‌ ప్రాజెక్టులలో 37 సెక్టార్ల కింద 914 అంగన్‌ వాడీ సెంటర్లు ఉన్నాయి. ఇవి కాకుండా రెండు మినీ అంగన్‌ వాడీ సెంటర్లు ఉన్నాయి. ఇందులో చార్మినార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలో 257, గోల్కొ్ండ 154, ఖైరతాబాద్‌ 141, నాంపల్లి 191, సికింద్రాబాద్‌ పరిధిలో 169 అంగన్‌ వాడీ సెంటర్లు ఉన్నాయి. ప్రస్తుతానికి సెక్టార్లలో ఉండే సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వైజర్లు అంగన్‌ వాడీ టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. నాలుగు దఫాల్లో భాగంగా మొదటి దఫాలో కుటుంబ నిర్వహణ అంశాలను యాప్‌ లో అప్‌ లోడ్‌ చేసే విధానంపై టీచర్లను ట్రెయిన్​ చేస్తున్నారు. రెండు రోజుల కిందట అడ్డగుట్ట, సికింద్రాబాద్‌ , బండ్లగూడ, బంజారా హిల్స్‌ , ఉప్పుగూడ, షేక్‌ పేట, ఖైరతాబాద్‌ , చార్మినార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గోల్కొం డ పరిధిలోని అంగన్‌ వాడీ టీచర్లకు శిక్షణ ఇచ్చారు.

ఎప్పటికప్పడు అప్ లోడ్ చేసేలా

మరో 15 రోజుల్లో ట్రెయినింగ్‌ పూర్తికానుంది. ఆ తర్వాత అంగన్‌ వాడీ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలోని పలు కాలనీలు, బస్తీలలో పిల్లలు , మహిళలు, గర్భిణులకు పౌష్టికాహారానికి సంబంధించిన చిత్రాలు, వివరాలను అక్కడి నుంచే సిబ్బంది అప్‌ లోడ్‌ చేసి ఆన్‌ లైన్‌ లో పెట్టనున్నారు. సెంటర్లలో చేపడుతున్న పనులు, కార్యక్రమాల వివరాలన్నింటినీ ఎప్పటికప్పుడు  అప్‌ లోడ్ చేయనున్నారు. ప్రధానంగా సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న చిన్నారుల వివరాలు , అనుబంధ పోషకాహారం, పాలు, గుడ్లు, వ్యాధి నిరోధక టీకాలు, విజిటింగ్‌ రిజిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పోషక ఆహార లోపం, సర్వే, గ్రోత్‌ రిజిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆరోగ్య లక్ష్మి, స్టాక్‌ రిజిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పరిశీలన వంటి రిజిస్టర్ల ఆధారంగా అప్‌ లోడ్‌ చేయాల్సి ఉంటుంది. స్మార్ట్‌ ఫోన్లరాకతో అంగన్‌ వాడీ టీచర్ల పనులు స్మార్ట్​కానున్నాయి.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy