స్మార్ట్ గా: న్యూ గెటప్ లో చిరు

CHIRUఖైదీ నెంబ‌ర్ 150 సినిమాతో గ్రాండ్‌గా రీ-ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఆ సినిమా భారీగా కలెక్ష‌న్లు సాధించి మెగాస్టార్ స్టామినాను మ‌రోసారి ప్రూవ్ చేసింది. `ఖైదీ నెంబ‌ర్ 150` వంటి క‌మ‌ర్షియ‌ల్ సినిమా త‌ర్వాత చిరంజీవి.. స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్య‌ల‌వాడ న‌ర్సింహారెడ్డి క‌థ‌ను ఎంచుకున్నారు. సురేంద‌ర్ రెడ్డి డైరెక్ష‌న్‌లో సైరా సినిమాను ప్రారంభించారు. ఇప్ప‌టికే ఓ షెడ్యూల్‌ను కూడా పూర్తి చేశారు. ఈ సినిమా కోసం గెడ్డాలు, మీసాలు పెంచి చిరంజీవి కొత్త లుక్‌లో క‌నిపించిన విష‌యం తెలిసిందే. లేటెస్టుగా చిరంజీవి మ‌రో కొత్త లుక్‌లో ద‌ర్శ‌న‌మిస్తున్నారు. జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పూర్తిగా గెడ్డాలు, మీసాలు తీసేసి చిరంజ‌వి అంద‌రికీ షాకిచ్చారు. హైద‌రాబాద్‌లో జ‌రిగిన జువ్వ‌ సినిమా ఫంక్ష‌న్‌లో చిరంజీవి ఇలా క‌నిపించారు.

దిక్కులు చూడ‌కు రామయ్య‌ ఫేమ్ త్రికోటి పేట ద‌ర్శ‌క‌త్వంలో రూపొంతోన్న సినిమా ‘జువ్వ‌’. ఈ సినిమాలో రంజిత్, పాల‌క్ ల‌ల్వానీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ను శనివారం ( జనవరి-13) ఉదయం మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ..అందరికి హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. జువ్వ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల చేయడం హ్యాపీగా ఉందన్నారు మెగాస్టార్.
అయితే ఈ గెటప్ నెక్ట్స్ సినిమా కోసమేనా అని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మీసం లేకుండా మెగాస్టార్ చాలాస్మార్ట్ గా ఉన్నారని తమ హీరోను పొగడ్తలతో ముంచేస్తున్నారు ఫ్యాన్స్.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy