స్మాల్ ఛేంజ్ : టెన్త్ రిజల్ట్స్ రేపు ఉదయం కాదు.. సాయంత్రం

SSC RESULTS EVENINGతెలంగాణలో పదవ తరగతి పరీక్షా ఫలితాలు శుక్రవారం (ఏప్రిల్-27) విడుదల కానున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఫలితాలు విడుదలలో చిన్న మార్పు జరిగింది. ఉదయం 10 గంటలకు విడుదల కావాల్సిన ఫలితాలు రాత్రి 7 గంటలకు విడుదల చేయనున్నారు. సెక్రటేరియట్‌ డీ బ్లాక్‌ లో శుక్రవారం రాత్రి ఏడు గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చేతుల మీదగా ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా మార్చి 15 నుంచి ఏప్రిల్ రెండో తేదీ వరకు జరిగిన పరీక్షలకు మొత్తం 5 లక్షల38 వేల 867 మంది విద్యార్థులు హాజరు కాగా, అందులో 2లక్షల 62 వేల 479 మంది బాలికలు, 2 లక్షల76 వేల 388 మంది బాలురు ఉన్నారు. ఫలితాల కోసం  www.bse.telangana.gov.in, http://results. cgg.gov.in లతోపాటు ఇతర వెబ్‌ సైట్లు అందుబాటులో ఉంటాయి.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy