స్మాల్ టైటానిక్ ఇది : ముంబై టూ గోవా షిప్ జర్నీ

mumbai-to-goaభారత టూరిజం శాఖ సరికొత్త ఆఫర్ తీసుకొచ్చింది. వివిధ నగరాలకు పడవ ప్రయాణం అందుబాటులోకి తీసుకొచ్చింది. ముందుగా ముంబై నుంచి గోవాకి క్రూయిజ్ షిప్ ప్రారంభించింది. ముంబై పోర్ట్ నుంచి బయలుదేరే ఈ షిప్ గోవాకు చేరుకుంటుంది. దీని పేరు యాంగ్రియా. ముంబై పోర్ట్ ట్రస్ట్ – యాంగ్రీయ సీ ఈగల్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ఇది నడుస్తోంది. ముంబై పోర్ట్ లో సాయంత్రం 5 గంటలకు ప్రారంభం అయ్యే ఈ షిప్.. తర్వాత రోజు ఉదయం 9గంటలకు గోవా చేరుకుంటుంది. మొత్తం 16 గంటలు జర్నీ సమయం.

ప్రస్తుతం ముంబై నుంచి గోవాకి వోల్వో బస్సులో వెళితే వెయ్యి నుంచి 2,500 వరకు ఛార్జీ వసూలు చేస్తున్నాయి ట్రావెల్స్. విమానంలో అయితే రూ.3,500 నుంచి రూ.7వేలు వరకు ఉంది. రైల్ లో అయితే గరిష్ఠంగా రూ.2,600 వరకు ఉంది. ముంబై టూ గోవాకి సముద్రంలో క్రూయిజ్ లో వెళితే రూ.7వేలు ఛార్జి వసూలు చేస్తున్నారు.

క్రూయిజ్ స్పెషల్ ఏంటీ :

యాంగ్రియా షిప్. ఇది ఓ స్మాల్ టైటానిక్ అనొచ్చు. దేశ, విదేశీ రుచులు అందించే 8 రెస్టారెంట్లు ఉన్నాయి. 24 గంటలూ కాపీ షాప్స్, రిక్రియేషన్ రూం, లాంజ్, స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. ఒక్కో టికెట్ రూ.7వేలు. రెండు సార్లు భోజనం, స్నాక్స్, టీ, కాపీ ఉచితం. పెళ్లిళ్లు, పార్టీలకు అనుకూలంగా ఉంది. 300 మంది ఈ షిప్ లో ప్రయాణించొచ్చు. సముద్రంలో ప్రయాణించేటప్పుడు.. తీరం ప్రాంతంలోని విశేషాలను వివరించటానికి గైడ్స్ కూడా ఉంటారు. రెగ్యులర్ జర్నీతో పోల్చితే ఇంది ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుందని చెబుతున్నారు నిర్వహకులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy