స్మాల్ ధరకే స్మార్ట్ ఫోన్..?

firefoxస్మార్ట్ ఫోన్ ను స్మాల్ ధరకే అందించేందుకు మొజిల్లా రెడీ అయ్యింది. ఇప్పటికే వెబ్ బ్రౌజర్ల రంగంలో ఉన్న మొజిల్లా రూ.1500 లకే అందించేందుకు ప్లాన్ చేస్తుంది. మొబైల్ కంపెనీలైన ఇంటెక్స్, స్పైస్ లతో కలిసి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసేందుకు ఢీల్ కుదుర్చుకుంది. మరికొన్ని నెలల్లోనే ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి రానుంది.

ఇండియా, చైనా దేశాలను టార్గెట్ చేసి ఈ మొబైల్ ను తయారు చేస్తునట్లు మొజిల్లా డిక్లేర్ చేసింది. ఈ ఫోన్లన్నీ గూగుల్ ఆండ్రాయిడ్, మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లతో ఆపరేట్ కానున్నాయి. ఇంటర్నెట్ వినియోగాన్ని తక్కువ కాస్ట్ కే జనానికి అందించేందుకు ఈ స్మార్ట్ ఫోన్ తయారు చేస్తున్నామన్నారు మొజిల్లా ఛీప్ ఆపరేటింగ్ ఆఫీసర్ లీ గాంగ్.

images (2)దేశ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ల సేల్స్ పెరుగుతున్నాయని ఈ ఏడాది 17 కోట్ల మంది కొత్తగా స్మార్ట్ ఫోన్ల వాడకాన్ని బిగిన్ చేశారని లీ గాంగ్ చెప్పారు. దేశ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్లలో శ్యామ్ సంగ్ కంపెనీకి చెందిన స్మార్ట్ ఫోన్లను 35 శాతం మంది వాడుతున్నారని, మైక్రో మాక్స్ 15, కార్బన్ 10, లావా 6, నోకియా కంపెనీ ఫోన్లను 4 శాతం మంది వాడుతున్నారని ఆయన చెప్పారు.

మంచి స్మార్ట్ ఫోన్ కావాలంటూ 5 వేల నుంచి 7 వేల మధ్యే ఉంటున్నాయని, దీంతో వాటి కంటే తక్కువ కాస్ట్ కే స్మార్ట్ ఫోన్ అందించాలనే ఉద్ధ్యేశంతో ఢీల్ చేసుకున్నామని, తమ ఢీల్ పై ఎంతో చాలా అంచనాలున్నాయన్నారు లీ గాంగ్.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy