స్లమ్ అండ్ ట్రాఫిక్ ఫ్రీ సిటీగా హైదరాబాద్: సీఎం

cmస్వచ్ఛ్ హైదరాబాద్ ప్రొగ్రామ్ పై హెచ్ఐసీసీలో సక్సెస్ మీట్

హాజరైన సీఎం, గవర్నర్, జీహెచ్ఎంసీ కమిషనర్

హైదరాబాద్ ను స్లమ్ అండ్ ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మారుస్తామన్నారు సీఎం కేసీఆర్. రోడ్లపై చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను కోరారు. నాలుగు రోజుల స్వచ్ఛ్ హైదరాబాద్ ప్రొగ్రామ్ పై.. హైదరాబాద్ హెచ్ఐసీసీలో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఫ్యూచర్ ప్లాన్ పై మంత్రులు, ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించారు. స్వచ్ఛ్ హైదరాబాద్ లో అధికారుల దృష్టికి వచ్చిన సమస్యలను అడిగి తెలుసుకున్నారు సీఎం. అన్ని శాఖల సమన్వయంలో ఫస్ట్ ఫేజ్ స్వచ్చ్ హైదరాబాద్ సక్సెస్ అయిందన్నారు. భవిష్యత్ ప్రణాళికపై అధికారులతో డిస్కస్ చేశారు. నాళాలు కబ్జా కావడంతో నగరంలో స్లమ్ పేరుకుపోతుందన్నారు. ఇక డొమెస్టిక్ పవర్ కట్స్ ఉండని చెప్పారు ముఖ్యమంత్రి.

సిటీని క్లీన్ గా ఉంచుకోవడం నగరవాసుల బాధ్యత అన్నారు గవర్నర్ నరసింహన్. ప్రయారిటీ ప్రకారం సమస్యలు పరిష్కరించాలన్నారు. ముందుగా సానిటేషన్, వాటర్ సప్లై పై దృష్టి పెట్టాలన్నారు. పార్కింగ్ ప్లేస్ లేక జనం ఇబ్బంది పడుతున్నారన్నారు గవర్నర్. స్వచ్ఛ్ హైదరాబాద్ గొప్ప కార్యక్రమమన్నారు సిఎస్ రాజీవ్ శర్మ. స్వచ్ఛ్ హైదరాబాద్ ప్రొగ్రామ్ తో ప్రజల్లో ఫుల్ అవేర్ నెస్ వచ్చిందన్నారు జీహెచ్ఎంసీ స్పెషల్ ఆఫీసర్ సోమేష్ కుమార్. త్వరలోనే సిటీ క్లీన్ అండ్ గ్లీన్ గా మారుతుందన్నారు. తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యపై స్పెషల్ కాన్సంట్రేట్ చేస్తున్నామని చెప్పారు. సిటీలో పర్యటించిన అధికారులను అభినందించారు సీఎం కేసీఆర్. స్వచ్ఛ్ హైదరాబాద్ లో భాగంగా ఫ్యూచర్ లో చేపట్టే పనులపై అధికారులకు దిశానిర్ధేశం చేశారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy