స్వచ్ఛ ఐకాన్ గా చార్మినార్

charminarచార్మినార్‌కు అరుదైన గౌరవం లభించింది. కేంద్ర ప్రభుత్వ ప్రకటించిన 10 స్వచ్ఛ ఐకానిక్ ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది చార్మినార్.  స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో ఈ ఎంపిక జరిగింది. దేశంలోని 100 ప్రముఖ ఐకాన్ నగరాలను స్వచ్ఛతకు మోడల్ గా తీర్చి దిద్దడానికి ఈ ఎంపి స్వచ్ఛ భారత్ మిషన్ సంకల్పించింది. దీనిలో భాగంగా ఒక్కో ఐకానిక్ ప్లేస్ ను స్వచ్ఛత పరంగా సమగ్ర అభివృద్ధికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ క్రింద ఒక్కొక్క ప్రభుత్వ రంగ సంస్థకు అప్పగిస్తారు. ఈ ప్రభుత్వ రంగ సంస్థ ఆయా ఐకానిక్ ప్లేస్ లో చేపట్టాల్సిన స్వచ్ఛ కార్యక్రమాలపై స్థానిక పాలనా యంత్రంగంతో చర్చించి ప్రణాళికబద్ధంగా పనులు చెప్పట్టడానికి కావాల్సిన నిధులను అందజేస్తుంది. మొదటి దశలో అమృతసర్ తో సహా పది ప్రాంతాలను స్వచ్ఛ ఐకాన్ గా గుర్తించింది. రెండవ దశలో చార్మినార్ తో సహా 10 నగరాలను ఐకానిక్ ప్రాంతాలుగా స్వచ్ఛ్ భారత్ మిషన్ ప్రకటించింది.

.. హైదరాబాద్- చార్మినార్

.. గంగోత్రి

.. యమునోత్రి

.. ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయం

.. గోవాలోని సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిస్సికి చెందిన చర్చ్, కాన్వెంట్

.. ఎర్నాకులంలోని ఆదిశంకరాచార్య నివాసం కాలడీ

.. శ్రావణబెలగలోని గోమఠేశ్వర్

.. జార్ఖండ్ లోని బైద్యనాథ్ జ్యోతిర్లింగ ఆలయం

.. బిహార్ లోని గయా తీర్థ్

.. గుజరాత్ లోని సోమనాథ్ ఆలయం

చార్మినార్ ను స్వచ్ఛ్ ఐకాన్ గా రూపొందించడానికి NTPC కి అప్పగించింది. చార్మినార్ తో పాటు పరిసర ప్రాంతాల్లో చేపట్టాల్సిన పనులు, చర్యలపై న్యూఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ డా బి. జనార్దన్ రెడ్డి ప్రత్యేకంగా హాజరయ్యారు. చార్మినార్ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకై ఈ సమావేశంలో చర్చించారు. దేశంలోనే చార్మినార్ ను స్వచ్ఛతకు మారుపేరుగా రూపొందించడానికి కావాల్సిన ఆర్థిక, సాంకేతిక సహకారం అందించడం, కాల పరిమితి తదితర అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చలు జరిపారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy