స్వచ్ఛ భారత్: మెట్రో సిటీల్లో హైదరాబాద్ టాప్

swacha-sarvekshanaస్వచ్ఛ భారత్ పథకం కింద అందజేసే స్వచ్ఛ సర్వేక్షణ్ 2017 ర్యాంకులను కేంద్రం విడుదల చేసింది.మొదటి పది స్థానాల్లో నిలిచిన పట్టణాలను కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు.  దేశవ్యాప్తంగా స్వచ్ఛత పాటించిన 434 పట్టణాలకు స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకులు ఇచ్చినట్లు చెప్పారు. ర్యాంకులు పొందిన పట్టణాలకు అభినందనలు తెలిపారు. 2019 నాటికి స్వచ్ఛభారత్‌ లక్ష్యం నెరవేరాలని ప్రధాని మోడీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

మొదటి పది స్థానాల్లో…

మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్‌ ప్రథమ స్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో మధ్యప్రదేశ్‌కే చెందిన భోపాల్‌ నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ మూడవ స్థానంలోను, గుజరాత్‌లోని సూరత్‌ 4 స్థానంలోనూ ఉన్నాయి. కర్ణాటకలోని మైసూర్‌ 5వ స్థానంలో, తమిళనాడులోని తిరుచురాపల్లి 6వ స్థానంలో, మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఢిల్లీ ఎన్‌సిఆర్‌ ఢిల్లీ 7వ స్థానంలో, మహారాష్ట్రలోని నవీ ముంబై 8వ స్థానంలో ఉన్నాయి. ఇక తొమ్మది పది స్థానాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి 9వ స్థానంలో, గుజరాత్‌లోని వడోదర 10వ స్థానంలో ఉన్నాయి.

ఇక హైదరాబాద్ మెట్రోసిటీల్లో టాప్ గా నిలిచి ..మొత్తంగా 22వ స్థానంలో ఉంది.

మరిన్ని స్థానాల్లో …సూర్యాపేట 30, అనంతపురంలోని తాడిపత్రి 31, నరసరావుపేట 40, కాకినాడ 43, తెనాలి 44, సిద్ధిపేట 45, రాజమండ్రి 46 స్థానాలను సొంత చేసుకున్నాయి.

2014 అక్టోబర్ లో స్వచ్ఛ భారత్‌ మిషన్‌‌ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు.

One Response to స్వచ్ఛ భారత్: మెట్రో సిటీల్లో హైదరాబాద్ టాప్

  1. Laxmi Prasad Aitha says:

    How can you forget Warangal it is in 28th position.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy