స్వాతంత్ర్యం @ 70 : భారత్ – పాక్ మధ్య పీస్ ఆంథమ్

india_pakflags-647_042916030103_081416111940_030917111832పాకిస్తాన్ పేరు వింటేనే పగలు, యుద్ధాలు,  కోపాలు, కొట్లాటలు గుర్తుకొస్తాయి. పక్కపక్కనే ఉండే భారత్, పాకిస్తాన్ పగలు..ప్రతీకారాలు మరిచిపోయి చేదోడువాదోడుగా ఉండడం జరుగుతుందా..ఇలా ఊహించుకుంటే బాగానే ఉంది అనిపిస్తుంది కదూ!. ఇప్పుడు ఇలాంటి ప్రయత్నమే చేశారు సామాజిక దర్శకుడు రామ్ సుబ్రమణియన్. ‘ఒక్క రోజు తేడాతో పాకిస్తాన్‌, భారత్‌లు స్వతంత్ర దేశాలుగా అవిర్భవించి, గడిచిన 70 ఏళ్లలో అంతకంతకూ దూరమవుతూ వచ్చాయి. ఈ ఉద్రిక్తతలన్నీ తొలిగిపోవాలని, ఇరుదేశాల్లో శాంతి నెలకొనాలని  ఎంతో మంది కోరుకున్నా, ఆ భావనను బయటికి చెప్పడానికి మాత్రం సంకోచిస్తారు. అలాంటి సంకోచాన్ని దూరం చేయడానే ‘పీస్‌ ఆంథమ్‌’  వీడియోను రూపొందించానని చెప్పుకొచ్చారు’..రామ్‌సుబ్రమణియన్‌.

పాక్‌, భారత్‌ స్వాతంత్ర్యదినోత్సవాలను పురస్కరించుకుని రెండు దేశాల సింగర్స్ తో ‘వాయిస్‌ ఆఫ్‌ రామ్‌’(VOR) పేరుతో రామ్‌ సుబ్రమణియన్‌ రూపొందించిన ‘పీస్‌ ఆంథమ్‌’ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ‘సరిహద్దులను కళలతో తెరిచినప్పుడు.. శాంతి కూడా వెంటవస్తుంది’ అనే నినాదంతో మొదలయ్యే ఈ వీడియోలో.. మొదట పాక్‌ జాతీయగీతమైన ‘పాక్‌ సర్‌జమీన్‌ షాద్‌ బాద్‌..’ను, ఆ వెంటనే ‘జనగణ మన’ను 13 మంది కలిసి పాడారు. వారిలో ఇషితా చక్రవర్తి, సంగీత భట్టాచార్య, నిఖిల్‌ డిసౌజా, నటాషా బేగ్‌, అలీ, అలైసియా దియాస్‌, జీశాన్‌ అలీ వంటి ప్రముఖ సింగర్లు కూడా ఉన్నారు. ఏది ఏమైన స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా రిలీజ్ చేసిన ఇరు దేశాల జాతీయగీతాలను అద్భుతంగా పాడారంటు కితాబిస్తున్నారు నెటిజన్లు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy