స్వాతంత్ర్యపు తొలి జెండా.. చెన్నైలో భద్రం

Tricolourఆగస్టు 15, 1947.. భారత స్వాతంత్ర్య దినోత్సం. ఆ రోజు మన జెండా స్వేచ్ఛగా రెపరెపలాడిన రోజు. 70 ఏళ్లనాటి ఆ జ్ఞాపకాలను తలుచుకుంటే.. మనస్సు ఉప్పొంగిపోతుంది. ఆ గుర్తులు కళ్లముందు కనపడితే.. దేహమంతా దేశభక్తితో నిండిపోతుంది. ఆ రోజు దేశవ్యాప్తంగా ఎన్నో త్రివర్ణ పతాకాలు ఎగిరాయి. ఢిల్లీ ఎర్రకోట నుంచి మొదలు గల్లిగల్లీలోను అవే దృశ్యాలు. ఆ పతాకాల్లో ఒకటి ఇప్పటికీ భద్రంగా దాచిపెట్టారు. అలనాటి జెండాను చెక్కుచెదరకుండా జాగ్రత్త చేసి పెడుతున్నారు. చెన్నైలోని సెయింట్ జార్జ్ కోటపై 1945 ఆగస్ట్ 15న ఎగరేశారు. 12.8 అడుగులున్న ఈ జెండాను ఉదయం 5 గంటల 5 నిముషాలకు ఎగురవేశారు.

దీనిని తొలిసారి జనవరి 26, 2013న కోటలోని మ్యూజియంలో ప్రజా సందర్శనకు ఉంచారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత ఎగురవేసిన త్రివర్ణ పతాకాలలో కేవలం ఇది ఒక్కటి మాత్రమే సురక్షితంగా ఉందని చెబుతున్నారు అధికారులు. ఈ పతాకపు అంచులు కొద్దిగా రంగుమారాయి. కాలానుగుణంగానే ఇది జరిగిందని భావిస్తున్నారు. ఈ అమూల్యమైన పతాకాన్ని జాతీయ పురాతత్వశాఖ సంరక్షిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకమైన బాక్సు రూపొందించి, దానికి అద్దాలు అమర్చి ఈ పతాకాన్ని అందులో ఉంచారు. దీనికి నలువైపులా సిలికా జెల్‌తో కూడిన నాలుగు బాక్సులు ఉంచారు. దీని వలన బాక్సులోని ఉష్ణోగ్రత అదుపులో ఉండి, త్రివర్ణ పతాకాన్ని కాపాడుతుంది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy