స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక రైళ్లు

స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా తెలుగురాష్ట్రాల్లో స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు తెలిపింది రైల్వే. స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొ నేందుకు సొంత ఊర్లకు వచ్చేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని, వారికోసం రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపారు రైల్వే సీనియర్‌ DCM ఉమామహేశ్వరరావు. నెంబర్‌ 07256 హైదరాబాద్‌ – నరసాపూర్‌ ప్రత్యేక రైలు ఆగస్టు 14వ తేదీన సాయంత్రం 6.50 గంటలకు బయలుదేరి రాత్రి 10.42కి పిడుగురాళ్ల, అర్ధరాత్రి 12.15కి గుంటూరు, 1.20కి విజయవాడ మరుసటి రోజు ఉదయం 6 గంటలకు నరసాపూర్‌ చేరుకొంటుంది.

నెంబర్‌ 07255 నరసాపూర్‌ – హైదరాబాద్‌ ప్రత్యేక రైలు ఆగస్టు 15వ తేదీన రాత్రి 7.30 గంటలకు బయలుదేరి 11.05కి విజయవాడ, అర్ధరాత్రి 12.20కి గుంటూరు, 1.35కి పిడుగురాళ్ల మరుసటిరోజు ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్‌, 6.50కి హైదరాబాద్‌ చేరుకొంటుంది. నెంబర్‌ 07001 హైదరాబాద్‌ – కాకినాడ టౌన్‌ ప్రత్యేక రైలు ఆగస్టు 14, 17 తేదీల్లో రాత్రి 9.05 గంటలకు బయలుదేరి అర్ధరాత్రి దాటాక 12.55కి పిడుగురాళ్ల, 2.55కి గుంటూరు, మరుసటి రోజు ఉదయం 9.25కి కాకినాడ టౌన్‌ కు చేరుకొంటుంది. నెంబర్‌ 07002 కాకినాడ టౌన్‌ – హైదరాబాద్‌ ప్రత్యేక రైలు ఈ నెల 15, 19 తేదీల్లో రాత్రి 9 గంటలకు బయలుదేరి మరుసటి రోజు వేకువజామున 3.40కి గుంటూరు, 4.50కి పిడుగురాళ్ల, ఉదయం 9.25కి సికింద్రాబాద్‌, 10 గంటలకు హైదరాబాద్‌ చేరుకొంటుంది.

ఈ రైళ్లలో ఏసీ టూటైర్‌, త్రీటైర్‌, 10 స్లీపర్‌క్లాస్‌ భోగీలుంటాయని సీనియర్‌ డీసీఎం తెలిపారు. నెంబర్‌ 12747 గుంటూరు – వికారాబాద్‌ పల్నాడు సూపర్‌ఫాస్టు ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆగస్టు 12, 13 తేదీల్లో ఒకటో నెంబర్‌ ప్లాట్‌ఫాం నుంచి బయలుదేరుతుందని రైల్వే తెలిపారు. 11, 14 తేదీల్లో మాత్రం ఏడో నెంబర్‌ ప్లాట్‌ఫాం నుంచి బయలుదేరి వెళుతుందన్నారు. ఈ మార్పులను ప్రయాణీకులు గమనించాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy