స్విస్ లో ఇండియన్ల ఖాతాల వివరాలు తెలుసుకోవచ్చు!

SWISఇప్పటి వరకు స్విస్ బ్యాంకులో ఉన్న భారతీయుల ఖాతాల వివరాలను తెలుపడానికి నిరాకరించింది స్విట్జర్లాండ్ దేశం. తాజాగా భారత్, స్విట్జర్లాండ్ దేశాలు సమాచారాన్ని ఆటోమేటిక్‌గా ఇచ్చిపుచ్చుకునేందుకు ఆ దేశ పార్లమెంటరీ కమిటీ గ్రీన్ సిగ్నలిచ్చింది. దీంతో భారతీయుల స్విస్ బ్యాంకు ఖాతాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వం తెలుసుకునేందుకు మార్గం సుగమమైంది. స్విట్జర్లాండు పార్లమెంటులోని  రాజ్యసభకు చెందిన ఆర్థిక వ్యవహారాలు, పన్నుల కమిషన్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశంతోపాటు మరో 40 దేశాలతో స్విట్జర్లాండ్ కుదుర్చుకున్న ఇటువంటి అగ్రిమెంట్లను ఆమోదించింది. అయితే వ్యక్తిగత లీగల్ క్లెయిములకు రక్షణను పటిష్టపరచాలని సలహా ఇచ్చింది. ఈ సిఫారసులను ఈ నెల 27న జరిగే స్విస్ పార్లమెంటులోని రాజ్యసభ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఆమోదించవలసి ఉంది. దీనికి ఆమోదం లభిస్తే స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకునే వారి వివరాలు భారత ప్రభుత్వం పొందగలుగుతుంది. బ్యాంకు ఖాతాదారు పేరు, అడ్రస్, , పుట్టిన తేదీ, ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్, వడ్డీ, డివిడెండ్, బీమా పాలసీల నుంచి వచ్చిన సొమ్ము, క్రెడిట్ బ్యాలెన్స్ వంటి వివరాలను ప్రభుత్వం తెలుసుకోవచ్చు.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy