స్వీడన్ ఉగ్ర బీభత్సం.. ఖండించిన భారత్

trukస్వీడన్‌ రాజధాని స్టాక్‌హోమ్‌లో ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే డ్రొట్నింగ్టన్‌ స్ట్రీట్ లోని ఓ స్టోర్ లోకి ట్రక్ దూసుకుపోనిచ్చారు. దీంతో ముగ్గురు పౌరులు మృతి అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఇది ఉగ్ర దాడేనని ఆ దేశ ప్రధాని స్టెఫన్‌ లోఫ్‌వెన్‌ ప్రకటించారు. దుకాణంలోకి ట్రక్‌ దూసుకెళ్లటంతో భయాందోళనకు గురైన స్థానికులు ఆర్తనాదాలు చేస్తూ పరుగులు తీశారు. ఈ క్రమంలో చాలా మంది తీవ్ర గాయాలకు గురయ్యారని భద్రతా వర్గాలు తెలిపాయి. ట్రక్‌ ధాటికి దుకాణం పూర్తిగా ధ్వంసమయ్యింది. ఈ దాడికి బాధ్యులెవరనే విషయం ఇంకా తెలియలేదు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 3 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. బీరును సరఫరా చేసే ఈ ట్రక్‌ను దుండగుడు బలవంతంగా దారి మళ్లించి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. దాడి అనంతరం దుండగుడు పరారైనట్లు సమాచారం. ఘటనా స్థలానికి సమీపంలోనే భారత రాయబార కార్యాలయం ఉంది. ఆ కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది అంతా క్షేమంగానే ఉన్నారని, ఎవరికీ ఎలాంటి అపాయంకలగలేదని విదేశీవ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌ ట్వీట్‌ చేశారు.

ప్రధాని మోడీ ఈ దాడిని ఖండించారు. స్వీడన్ వాసులకు భారత్ అండగా ఉంటుందని తెలిపారు. ఉగ్రపోరులో సమిష్టిగా పోరాడదామని పిలుపునిచ్చారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy