హద్దులు మీరిన బావకు బుద్ది చెప్పిన మరదలు

Women-Beats-Up-Man-In-Publicబావా మరదల్ల సరసాలు సహజమే. అది చూసి నలుగురు ముసిముసి నవ్వులు నవ్వుకుంటారు.. కానీ ఎవ్వరూ ఏమనరు. అయితే, అది మాటల వరకే పరిమితమై ఉండాలి గానీ హద్దులు  దాటకూడదు. ఉత్తరప్రదేశ్ లో హద్దులు మీరిన బావకు దేహశుద్ధి చేసింది ఓ మరదలు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో తనపట్ల శృతి మించి వ్యవహరించిన బావకు ఓ మరదలు సరైన బుద్ది చెప్పింది. నలుగురిలోకి ధైర్యంగా ఈడ్చుకొచ్చి చెంపలు వాయించి చెడామడా తిట్టి పారేసింది. అందరూ చూస్తుండగానే అతడి చొక్కా పట్టి ఈడ్చుకొచ్చి నలుగురిలోనే చెప్పుతో కొట్టింది. తనకు చేసిన అవమానాన్ని, తనపై దాదాపు లైంగిక దాడికి పాల్పడ్డటూ చేసిన ప్రయత్నాన్ని ఆ మరదలు గాయాలతో సహా అందరికీ చూపించింది. అది చూసిన బంధువులు సైతం అతన్ని చితుకబాదారు. సాక్ష్యాధారాలతో సహా అతడు దొరికిపోవడంతో కుక్కిన పేనులా పడున్నాడు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy