
సినిమా పోస్టర్ యూత్‌ను చెడగొట్టేలా ఉందని వీహెచ్ చించేస్తే, వీహెచ్ దుస్తులు చించేయాలని రామ్ గోపాల్ వర్మ విజయ్‌కు సూచించడంతో వివాదం రాజుకుంది. అయితే.. ఈ వ్యవహారంపై ఎవరో ఎడిట్ చేసిన ఫొటోను ఆర్జీవీ తన ఖాతాలో పోస్ట్ చేశాడు. గతంలో అనురాగ్ కశ్యప్‌కు ముద్దు పెడుతూ ఇన్‌స్టాగ్రాంలో ఆర్జీవీ ఓ ఫొటో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలో అనురాగ్‌కు బదులు వీహెచ్‌కు వర్మ ముద్దు పెడుతున్నట్లు ఓ ఫొటోను ఎవరో ఎడిట్ చేశారు. ఆ ఎడిట్ చేసిన ఫొటోను వర్మ తన ఫేస్బుక్లో పోస్ట్ చేసి వెటకారంగా కామెంట్స్ చేశాడు వర్మ. ఇది బాగా వైరలవుతుంది.