హరీష్ రావు అభివృద్ధి మంత్రం..

Harishrao-in-medak-2ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు మెదక్ జిల్లాలో 26 కోట్ల డెవలప్ మెంటు కార్యక్రమాలను ప్రారంభించారు. గురువారం మెదక్ వెళ్లిన ఆయన.. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మెదక్ జిల్లాకు తాగు నీటి రంగానికి పెద్ద పీట వేస్తామని తెలిపారు . ఘనపూర్ కాలువల ఆధునీకరణ పనులను ప్రారంభించారు. ఈ కెనాల్స్ ను 25 కోట్ల జైకా నిధులతో పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత కోటి రూపాయలతో నిర్మించిన మెదక్ మార్కెట్ యార్డును ఓపెన్ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహనలో మంచి రిజల్ట్స్ సాధించిన 5 మహిళా సంఘాల కోసం 25 లక్షల చొప్పున 1.25 కోట్లు రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నిధులతో మహిళా సంఘాలకు గోదాములు నిర్మించనున్నట్లు తెలిపారు. మెదక్ జిల్లా పర్యటనలో హరీష్ రావుతో పాటు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డిలు పాల్గొన్నారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy