హర్యానా, పంజాబ్ లో హై టెన్షన్ : గుర్మీత్ సింగ్ దోషి

baba (2)డేరా సచ్చా సౌదా అనే సిక్కు మత సంస్ధ చీఫ్‌ బాబా గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ను దోషిగా తేల్చింది పంచకుల సీబీఐ కోర్టు. 2002లో ఇద్దరు మహిళలపై అత్యాచారం చేశారనే ఆరోపణలపై కేసు నమోదు అయ్యింది. 14 ఏళ్ల విచారణ తర్వాత.. కోర్టు దోషిగా తేల్చటంతో వెంటనే ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. అంబాలా జైలుకు తరలిస్తున్నారు. ఆగస్ట్ 28వ తేదీన శిక్షను ఖరారు చేయనున్నట్లు ప్రకటించింది కోర్టు. తీర్పు సందర్భంగా.. 2002లో ఆశ్రమంలోని ఇద్దరు మహిళలపై గుర్మీత్ అత్యాచారానికి పాల్పడినట్లు సాక్ష్యాధారాలు ఉన్నాయన్నారు న్యాయమూర్తులు. డేరాబాబా శిక్షకు అర్హుడేనని తేల్చిచెప్పారు.

గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ను దోషిగా తేల్చడంతో.. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. 15వేల మంది భద్రతలో ఉన్నారు. 115 కంపెనీల పారా మిలిటరీ బలగాలు కూడా రంగంలోకి దిగాయి. 144 సెక్షన్ విధించారు. ఈ రెండు రాష్ట్రాల్లోనే 200 రైల్ సర్వీసులను రద్దు చేసింది ప్రభుత్వం. పంచకుల సీబీఐ కోర్టుకు వెళ్లే దారులన్నింటినీ మూసివేసింది. అయినా వేలాది మంది అనుచరులు కోర్టు సమీపంలోని రోడ్లపై బైఠాయించారు.

గుర్మీత్ సింగ్ కు ఆయన భక్తులు మద్దతిస్తున్నారు. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు, అనుచరులు, మద్దతుదారులు సిర్సాకు చేరుకున్నారు. సిర్సాలో 800 ఎకరాల్లోని ఆశ్రమంలో లక్ష మంది భక్తులున్నట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. చంఢీగఢ్ కు కూడా భారీగా భక్తులు చేరుకుంటున్నారు.

2002లో గుర్మీత్ రామ్ రహీమ్ పై రేప్ కేసు రిజిస్టర్ చేసింది సీబీఐ. పంజాబ్-హర్యానా హైకోర్టు ఆదేశాలతో సీబీఐ కేసు పెట్టింది. సిర్సాలోని తన ఆశ్రమంలో ఇద్దరు సాధ్వీలను గుర్మీత్ రేప్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే ఒక బాధితురాలు అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పెయికి లేఖ రాశారు. ఆయన ఆదేశాలతోటి అధికారుల్లో కదలికల వచ్చింది. 15 ఏళ్లుగా పంచకులలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో కేసు నడిచింది. 15 ఏళ్ల తర్వాత బాధితులకు అనుకూలంగా తీర్పునిచ్చింది సీబీఐ కోర్టు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy