‘హలో’ మైక్ టెస్టింగ్ 123 అంటున్న నాగ్

121117nag60విక్రమ్ కె.కుమార్ డైరెక్షన్ లో అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ‘హలో’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాను నాగార్జున నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం మరింత కష్టపడుతున్నాడట నాగ్. త్వరలో ఈ సినిమా టీజర్‌ విడుదల కాబోతోంది. ఈ టీజర్‌లో నాగార్జున వాయిస్‌ ఓవర్‌ ఇవ్వనున్నట్లు టాలీవుడ్‌ టాక్. అయితే విజువల్‌ ఎఫెక్ట్స్‌ కారణంగా విడుదల ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ మూవీకి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు. అఖిల్‌ సరసన  కల్యాణి హీరోయిన్ గా నటిస్తున్న ‘హలో’ డిసెంబర్‌ 22న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy