హవ్వ.. చైనా నీకిది తగునా.?

chinaసిక్కిం సరిహద్దుల్లో చైనా రెచ్చిపోతుంది. భారత భూభాగంలోకి చొచ్చుకురావడానికి ప్రయత్నిస్తోంది. తాజాగా ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు భారత సైనికులు. చైనా సైనికులు తిరిగి భూభాగంలోకి వెళ్లేందుకు నిరాకరిస్తూ వాగ్వివాదానికి దిగిన ఓ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో చైనా పీపుల్స్ ఆర్మీ సైనికులు.. భారత భూభాగంలోకి చొచ్చుకు రావడం స్పష్టంగా కనిపిస్తోంది. భారత సైనికులు వారిని అడ్డుకొని.. వారించి వెనుకకు పంపుతున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తీవ్రస్థాయి ఉద్రిక్తతలు నెలకొన్న సిక్కిం సరిహద్దుల దగ్గరే ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. సరిహద్దుల్లో తాజా పరిస్థితి ఈ వీడియోలో స్పష్టమవుతోంది. మరోవైపు సిక్కింలో భారత్‌తో కొనసాగుతున్న ప్రతిష్టంభన విషయంలో రాజీకి ఆస్కారం లేదని, సమస్యను పరిష్కరించే బాధ్యత భారత్‌పైనే ఉందని చైనా బుధవారం స్పష్టం చేసింది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy