హాంగ్‌కాంగ్ ఓపెన్: సింధు శుభారంభం

pv-sindhuహాంగ్ కాంగ్ ఓపెన్లో భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు శుభారంభం చేశారు. బుధవారం(నవంబర్-22)  ఉదయం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో డెన్మార్క్‌కు చెందిన మెట్టే పౌల్సెన్‌పై 21-19, 23-21 తేడాతో సైనా చెమటోడ్చి నెగ్గింది. మధ్యాహ్నం జరిగిన పోరులో రెండో సీడ్ సింధు 21-18, 21-10 తేడాతో హాంగ్ కాంగ్ ప్లేయర్ లువాంగ్ యుయెట్ యీపై నెగ్గింది. తొలి గేమ్‌లో లువాంగ్ పోటీ ఇచ్చినప్పటికీ.. రెండో గేమ్‌లో మాత్రం సింధు హవానే సాగింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy