హాకీ ఆసియాకప్‌: బంగ్లాపై భారత్‌ విజయం

Hockeyహకీ ఆసియాకప్‌ పూల్‌-ఏలో బంగ్లాదేశ్‌తో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో భారత సీనియర్‌ పురుషుల హాకీ జట్టు రెండో విజయం సాధించింది. జపాన్‌పై గెలిచి శుభారంభాన్ని అందుకున్న భారత్‌ తన జైత్రయాత్రను కొనసాగించింది. శుక్రవారం(అక్టోబర్-13) జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో 7-0తో ఆతిథ్య బంగ్లాదేశ్‌ను ఓడించింది. మ్యాచ్ ప్రారంభం నుంచి ఇండియా ప్లేయర్లు  ఆధిపత్యం ప్రదర్శించారు.

గుర్జాంత్‌ సింగ్‌ తొలి గోల్‌ సాధించాడు. ఆ తర్వాత ఆకాశ్‌ దీప్‌, లలీత్‌ ఉపాధ్యాయ, అమిత్‌ రోహిదాస్‌, రమణ్‌దీప్‌ సింగ్‌లు గోల్స్‌ సాధించారు. పెనాల్టీ కార్నర్‌లు సద్వినియోగం చేసుకుంటూ హర్మన్‌ ప్రీత్‌ సింగ్‌ రెండు గోల్స్‌ సాధించాడు. దీంతో భారత్‌ 7-0తో బంగ్లాదేశ్‌పై సునాయసంగా విజయం సాధించింది. పూల్‌-ఏలో భారత్‌ మూడో లీగ్‌ మ్యాచ్‌ను ఆదివారం( అక్టోబర్-15) పాకిస్తాన్ తో ఆడనుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy