
సమావేశాల్లో OBC, మెడికల్, ట్రిపుల్ తలాక్, వినియోగదారుల రక్షణ, తప్పనిసరి విద్య ఎన్సీఈఆర్టీ, ట్రాన్స్జెండర్ వంటి బిల్లులు చర్చకు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు ఎపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, తమిళనాడు-కర్ణాటకల మధ్య నడుస్తున్న కావేరీ వివాదం, జమ్ము కశ్మీర్లో మద్దతు ఉపసంహరణ తదితర అంశాలపై పార్లమెంటు సమావేశాలు వాడిగా వేడిగా జరిగే అవకాశాలున్నాయి. ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతి అంశానికి సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు అనంత్ కుమార్. అవిశ్వాస తీర్మానం వచ్చినా దానిపై కూడా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.