హాట్ హాట్ గా ఢిల్లీ పాలిటిక్స్…

ఢిల్లీ రాష్ట్ర రాజకీయాలు.. వేడి పుట్టిస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుపై సుప్రీం కోర్టు ఇవాళ నిర్ణయం వెల్లడించే టైంలో… హస్తినలో క్షణక్షణానికీ పరిణామాలు మారుతున్నాయి. త్వరలోనే అఖిలపక్ష భేటీ నిర్వహిస్తామని రాజ్ భవన్ ప్రకటించింది. దీంతో.. ప్రధాన పార్టీల మధ్య మళ్లీ మాటల యుద్ధం జోరందుకుంది. రాష్ట్రంలో ఎన్నికలపై కేంద్రం ఎటూ తేల్చకపోవడం.. మరోవైపు ఎన్నికలకు ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలు డిమాండ్ చేస్తుండడంతో రోజురోజుకూ ఉత్కంఠ పెరుగుతోంది. ఈ మధ్యలో.. అఖిలపక్షం నిర్వహించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ డిసైడవడం.. కొత్త గొడవకు కారణమవుతోంది. ప్రభుత్వ ఏర్పాటుపై ఆమ్ ఆద్మీ అధినేత కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై… ఇవాళ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వనుంది. అటు ఎల్జీ నజీబ్ జంగ్.. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ తో భేటీ అయ్యారు. ప్రస్తుత పరిణామాలపై డిస్కస్ చేశారు. ఇన్నాళ్లూ బీజేపీని టార్గెట్ చేస్తూ వచ్చిన కేజ్రీ… నజీబ్ జంగ్ పైనా విమర్శలు గుప్పించారు. రాష్ట్రపతి పాలన ఉన్న 8 నెలల్లో ఆయన ఏం చేయలేకపోయారని ఎద్దేవా చేశారు.  కేజ్రీ కామెంట్స్ కు.. బీజేపీ స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చింది. అసలు ఆమ్ ఆద్మీ గురించి ఢిల్లీ ప్రజలు ఎప్పుడో మరిచిపోయారన్నారు.. బీజేజీ ఢిల్లీ చీఫ్ సతీష్ ఉపాధ్యాయ. కేజ్రీవాల్ మాటలన్నీ పబ్లిసిటీ స్టంట్ అంటూ కొట్టాపారేశారు. ప్రధాన పార్టీల మాటల యుద్ధం మధ్య… సుప్రీం తీర్పు కీలకంగా మారింది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy