హారతి ఇచ్చి.. వీర తిలకం దిద్ది : తెలంగాణలో పవన్ యాత్ర ఫ్రారంభం

pawan-kalyan-tsకొండగట్టుకు బయలుదేరారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. భార్య లెజినోవా ఎదురొచ్చి.. హారతి ఇచ్చి తిలకం దిద్దారు.  దిష్టితీశారు మహిళలు. కొండగట్టుకు బయలుదేరారు పవన్.  మధ్యాహ్నం 3 గంటలకు కొండగట్టుకు చేరుకుని ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత యాత్రకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించనున్నారు పవన్ కల్యాణ్. సాయంత్రం కరీంనగర్  చేరుకుని జనసేన పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడతారు పవన్. పార్టీ  భావ జాలాన్ని విస్తరించడానికి,   ప్రజా సమస్యల  అధ్యయానికి  టూర్  చేస్తున్నానని  చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో నాలుగు రోజులు.. 3 జిల్లాల్లో రాజకీయ యాత్ర చేయనున్నారు పవన్.

మంగళవారం(జనవరి-23) ఉదయం 10.45 కు కరీంనగర్ లోని జగిత్యాల రోడ్ లో శుభం గార్డెన్స్ లో ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్  జిల్లాల జనసేన కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం అవుతారు. మధ్యాహ్నం లంచ్ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం బయల్దేరి వెళతారు. రాత్రి కొత్తగూడెంలోనే ఉండనున్నారు. 24 వ తేదీ ఉదయం 9.30 కు కొత్తగూడెం నుంచి ర్యాలీగా మధ్యాహ్నం 1.30 వరకు ఖమ్మం చేరుకుంటారు. 3 గంటలకు ఖమ్మంలోని ఎంబీ గార్డెన్స్ లో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల కార్యకర్తల సమావేశానికి హాజరుకానున్నారు పవన్. మీటింగ్ తర్వాత ఖమ్మం నుంచి నేరుగా హైదరాబాద్  బయల్దేరేలా  షెడ్యూల్ ప్లాన్ చేశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy