హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆత్మహత్య

Chester-Benningtonప్రముఖ హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ బెన్నింగ్టన్ ఆత్మహత్య చేసుకున్నారు. ప్రముఖ పాప్ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ లింకిన్ పార్క్ ట్రూప్‌లో ప్రధాన సింగర్, గిటారిస్ట్ అయిన చెస్టర్ బెన్నింగ్టన్ (41) గురువారం ఆత్మహత్య చేసుకున్నట్లు లింకిన్ పార్క్ ట్రూప్‌లో గీత రచయిత అయిన మైక్ షినోడ ట్విట్టర్ ద్వారా ధ్రువీకరించారు. లాస్‌ఏంజిలిస్ కౌంటీ పోలీస్ అధికారి కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. తన ఇంట్లోనే ఉరేసుకుని బెన్నింగ్టన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమికంగా ఆత్మహత్యగానే కేసును నమోదు చేశారు పోలీసులు. కాగా, అతడి మరణానికి కొన్నిగంటల ముందే లింకిన్ పార్క్.. ‘టాకింగ్ టు మై సెల్ఫ్’ అనే వీడియో ఆల్బమ్‌ను విడుదల చేశారు. ఈ పాటలో ముఖ్యంగా బెన్నింగ్టన్ భార్య తలిందా అన్ బెంట్లే బ్యాక్‌డ్రాప్‌లోనే ఈ పాటను చిత్రీకరించినట్టు తెలుస్తోంది.

ఆరిజోనాలో పుట్టిపెరిగిన బెన్నింగ్టన్‌ రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఆయనకు ఆరుగురు పిల్లలు. తన జీవితంలో జరిగిన సంఘటనలను రెండేళ్ల కిందట ఓ బ్రిటీష్ మ్యూజిక్ సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. తన తల్లిదండ్రుల విడాకులతో తీవ్ర మనస్తాపం చెంది మద్యం, డ్రగ్స్‌కు అలవాటు పడినట్టు ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు బెన్నింగ్టన్. బెన్నింగ్టన్ మృతి పట్ల లింకిన్ పార్క్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు పాప్ సింగర్లు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy