హాస్పిటల్ లో ఆక్సిజన్ లేక 30మంది చిన్నారులు మృతి

baby_11ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. ఆక్సిజన్‌ అందక 48 గంటల్లో 30మంది చిన్నారులు చనిపోయారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గోరఖ్‌పూర్‌లోని బీఆర్‌డీ మెడికల్‌ హాస్పిటల్ లో ఈ విషాదం చోటు చేసుకున్నట్లు తెలిపారు కలెక్టర్‌ రాజీవ్‌ రౌటెలా. చనిపోయిన చిన్నారులు అంతా మెదడువాపు వ్యాధికి చికిత్స పొందుతున్నారు. మరో విశేషం ఏంటంటే.. రెండు రోజుల కిందటే సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఈ హాస్పిటల్ లో తనిఖీలు నిర్వహించారు. దిగ్భ్రాంతి కలిగించే అంశం ఏంటంటే.. ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్న కంపెనీకి హాస్పిటల్ రూ.66లక్షల బాకీ ఉంది. అది ఇప్పటి వరకు చెల్లించకపోవడంతో ఆ కంపెనీ ఆక్సిజన్‌ పంపిణీని ఆపేసింది. ఈ నిర్లక్ష్యమే చిన్నారుల ప్రాణాలు పోవడానికి కారణమైంది. ఇదిలా ఉంటే మరో 45 మంది చిన్నారులు వెంటిలేటర్ పై ఉన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy