హిట్ అండ్ రన్ కేసు : సల్మాన్ నిర్దోషి

salman-khan-in-courtబాంబే హైకోర్టులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ కు ఊరట లభించింది. హిట్ అండ్ రన్ కేసులో అభియోగాల నిరూపణలో ప్రాసిక్యూషన్ విఫలమయ్యిందని వ్యాఖ్యానించారు న్యాయమూర్తి. ప్రస్తుత సాక్ష్యాలతో దోషిగా నిర్ధారించలేమని.. సల్మాన్ పై నేరాన్ని నిరూపించలేకపోయారని కోర్టు వ్యాఖ్యానించింది. సల్మాన్ పై మోపిన అన్ని అభియోగాలను కొట్టివేసింది కోర్టు.

 

కేసు వివరాలు :

2002లో  సల్మాన్ ఖాన్ మద్యం మత్తులో కారునడిపి ఒకరి మృతికి కారణమయ్యాడని అభియోగాలు నమోదయ్యాయి. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడ్డారు. కేసుకు సంబంధించి ముంబై సెసన్స్ కోర్టు ఈ ఏడాది మే 6న సల్మాన్ కు ఐదేళ్లు జైలు శిక్ష విధించింది. అయితే ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ముంబై హైకోర్టులో అప్పీల్ చేసుకున్నాడు. మే 8న బెయిల్ పొందాడు. రెండు రోజులు జైల్లో ఉన్న సల్లూ భాయ్ జైలు నుంచి బయటపడ్డాడు. ప్రమాదం జరిగినప్పుడు డ్రైవింగ్ చేయలేదని.. తన డ్రైవర్ అశోక్ నడిపాడని సెషన్స్ కోర్టుకు తెలిపాడు సల్మాన్. అయితే సల్మాన్ కు వ్యతిరేకంగా అక్కడి కార్ పార్కింగ్ అటెండెట్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. తను సల్మాన్ కే కారు తాళాలు ఇచ్చానని సాక్ష్యమిచ్చాడు. దీనిపై వివరణ అడుగగా తనకు గుర్తు లేదన్నాడు సల్మాన్. సల్మాన్ కారు డ్రైవర్ తనే కారు నడిపానని కోర్టు ముందు సాక్ష్యమిచ్చాడు. అయితే కోర్టు సల్మాన్ కు ఐదేళ్లు జైలు శిక్ష వేసింది. దీనిపై హైకోర్టుకు వెళ్లిన సల్మాన్ కు సెషన్స్ కోర్టు తీర్పుపై స్టే ఇవ్వడమే కాక.. బెయిల్ ఇచ్చింది.

అయితే… కొందరు మాత్రం… హైకోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేశంలో న్యాయం డబ్బున్నవారికి ఒకలా, పేదవారికి మరోలా ఉంటోందన్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy