
మృతుల్లో నల్లగొండ జిల్లాకు చెందిన దుబ్బాక కొండల్‌రెడ్డి (48), యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన కొంతం రాజిరెడ్డి (52) ఉన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, పోలీసు బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.
కొండల్‌రెడ్డి, రాజిరెడ్డి .. హైదరాబాద్‌లోని సుశీ హైటెక్ కంపెనీలో మేనేజర్లు. ఆఫీసు పనిలో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లారు. ఈ నేపథ్యంలో వీరు ప్రయాణిస్తున్న జీపుపై కొండచరియలు పడ్డాయి. జీపు లోయలో పడిపోయింది. ఘటనలో కొండల్‌రెడ్డి, రాజిరెడ్డి మృతి చెందారు. రాజిరెడ్డి మృతదేహా న్ని ఆదివారం ఎల్బీనగర్లోని ఆయన నివాసానికి తరలించారు. కొండల్‌రెడ్డి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు మూడు రోజులు పడుతుందని కుటుంబీకులు చెప్పారు.