హిమాయత్‌ నగర్ లో రోడ్డు, డ్రైనేజీ పనులు : నెల రోజులు ట్రాఫిక్ ఆంక్షలు

Himayathnagarహిమాయత్‌ నగర్ ప్రధాన రహదారి, హిమాయత్‌ నగర్ స్ట్రీట్ నెంబర్-5లో జరుగుతున్న వీడీసీసీ రోడ్డు నిర్మాణ పనులు, డ్రైనేజీ లైన్ పునర్నిర్మాణ పనులతో 30 రోజులపాటు వాహనదారులకు దారి మళ్లింపులను చేపడుతున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్. ఈ రోడ్డులో ఆంక్షలు
మే 3 నుంచి జూన్ 1వ తేదీ వరకు అమల్లో ఉంటాయని తెలిపారు ఆయన.

దారి మళ్లింపు ఇలా…

*నారాయణగూడ ఎక్స్ రోడ్డు, ఫ్లై ఓవర్ మీదుగా లిబర్టీ వైపు వచ్చే వాహనాలను వై జంక్షన్ నుంచి పాత ఎమ్మెల్యే క్వార్టర్స్, కేఫ్ ఏ బహార్, పోలీసు కమిషనర్ కార్యాలయం, బషీర్‌బాగ్, లిబర్టీ వైపు మళ్లిస్తారు.
*మెల్కోటే పార్క్, విఠల్‌వాడీ నుంచి లిబర్టీ వెళ్లే వాహనాలకు హిమాయత్‌నగర్ వై జంక్షన్ వైపు అనుమతించరు… పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ మీదుగా మళ్లిస్తారు.
*అంబేద్కర్ విగ్రహం, బషీర్‌బాగ్ నుంచి నారాయణగూడకు వయా లిబర్టీ నుంచి వెళ్లే వాహనాలను హిమాయత్‌నగర్ స్ట్రీట్ నెం. 5 వద్ద కుడి వైపు సంగీత మొబైల్ మీదుగా మళ్లిస్తారు.

ప్రత్యామ్నాయ మార్గాలు..

*విద్యానగర్ నుంచి లిబర్టీ వెళ్లే వాహనదారులు హిందీ మహావిద్యాలయ, అజామాబాద్, ఆర్టీసీ క్రాసు రోడ్డు, ఇందిరా పార్క్, కట్టమైసమ్మ, లిబర్టీ మార్గాల్లో వెళ్లాలి.
*బర్కత్‌పుర జంక్షన్ నుంచి వచ్చే వాహనాలు క్రౌన్ కేఫ్, సుందరయ్య పార్క్, వీఎస్టీ, ఆర్టీసీ క్రాసు రోడ్డు, ఇందిరా పార్క్, కట్టమైసమ్మ, లిబర్టీ రోడ్డులో ప్రయాణించాలి.
*నారాయణగూడ నుంచి ఆర్టీసీ బస్సులను హిమాయత్‌నగర్ వై జంక్షన్, పాత ఎమ్మెల్యే క్వార్టర్స్, కేఫ్ ఏ బహార్, బషీర్‌బాగ్ వైపు రూటులో వెళ్లాలి.
*అంబేద్కర్ విగ్రహం నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు లిబర్టీ నుంచి బషీర్‌బాగ్, కేఫ్ ఏ బహార్, పాత ఎమ్మెల్యే క్వార్టర్స్, హిమాయత్‌నగర్ వై జంక్షన్ దారిలో ప్రయాణించాలి.
*వాహనదారులు హిమాయత్‌నగర్ వై జంక్షన్ నుంచి లిబర్టీ టీ జంక్షన్, లిబర్టీ టీ జంక్షన్ నుంచి హిమాయత్‌నగర్ వై జంక్షన్ దారిలో వాహనాలను నిలుపరాదు.
ఈ ప్రత్యామ్నాయ మార్గాలు, మళ్లింపులను గుర్తించి వాహనదారులు సురక్షితమైన ప్రయాణం సాగించాలని విజ్ఞప్తి చేశారు పోలీసు కమిషనర్.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy