హిమాలయాల్లో ఓ పర్వతానికి తెలంగాణ పేరు?

8076_TS Mountainesజూన్ 2… కొత్త రాష్ట్రం ఏర్పడి సరిగ్గా ఏడాది పూర్తయింది. నవ తెలంగాణ ఆవిర్భావ వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా పండగ వాతావరణం. ఊరూవాడ తొలి పండుగను గ్రాండ్ గా జరుపుకుంటోంది. అయితే ఈ సంబరాన్ని కాస్త డిఫరెంట్ గా.. చరిత్రలో నిలిచిపోయేలా జరపాలనుకున్నారు అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ సభ్యులు. హిమాలయ పర్వతాలపై తెలంగాణ జెండాను రెపరెపలాడించాలని డిసైడయ్యారు. థాట్ రాగానే హిమాలయాల వైపు అడుగులేశారు మౌంటేనీర్స్. తాము అధిరోహించిన పర్వతానికి తెలంగాణ పేరుపెట్టాలని నిర్ణయించారు. హిమాలయాల్లో సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో 1,600 మీటర్ల పర్వతాన్ని అధిరోహించారు. ఈ పర్వతానికే తెలంగాణ పేరుపెట్టాలని ఇండియన్ మౌంటెనీరింగ్ ఫెడరేషన్ ను కోరనున్నారు. హిమాలయ యాత్ర ముగించుకుని వచ్చాక మౌంటెనీరింగ్ ఫెడరేషన్ ను సంప్రదించనున్నారు.

మే 18న ఏడుగురు సభ్యులతో హిమాలయాలకు వెళ్లిన బృందం 6,000 మీటర్ల ఎత్తున్న గోలేప్ కాంగ్రీ, 6,140 మీటర్ల స్టాక్ కాంగ్రీ పర్వతాలను అధిరోహించింది. ఇంకా 6,666 మీటర్ల లంగ్ సర్ కాంగ్రీ పర్వతాన్ని అధిరోహించాల్సి ఉంది. జూన్ 7న యాత్ర ముగించుకుని హైదరాబాద్ వచ్చాక తెలంగాణ పర్వతం పేరు గురించి ఇండియన్ మౌంటెనీరింగ్ ఫెడరేషన్ ను సంప్రదిస్తామంటున్నారు. మొత్తానికి ఇవాళ్టి నుంచి జూన్ 7 వరకు రాష్ట్రంలో జరుగుతున్న అవతరణ వేడుకల సందర్భంగా తెలంగాణ అడ్వెంచర్స్ క్లబ్ సభ్యులు తీసుకున్న నిర్ణయం ఫెంటాస్టిక్ అంటున్నారంతా. హిమాలయాలపై తెలంగాణ జెండా ఎగురేసిన వీరు.. అందులో ఓ పర్వతానికి తెలంగాణ పేరు పెట్టి మనకు కానుకగా అందిస్తే అంతకన్నా కావాల్సిందేముంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy