హీరోగా రకుల్ తమ్ముడు

17717rakulగ్లామరస్ పాత్రలతో అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ల లిస్టులోకి చేరిన అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ సూపర్ హిట్స్ మూవీస్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’తో హీరోయిన్గా గుర్తింపు పొందిన ఈ బ్యూటీకీ ఆఫర్లకేమీ కొదవలేదు. ఇదిలావుంటే ఇప్పుడు రకుల్  చిన్న తమ్ముడు అమన్‌ ప్రీత్‌ సింగ్‌ కూడా హీరోగా పరిచయం కాబోతున్నారు. అమన్‌ కీలక పాత్రలో ఓ షార్ట్ ఫిలిం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీలుక్‌ను సోమవారం(జూలై-17)న విడుదల చేశారు. దీన్ని రకుల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘నీ ఫస్ట్ షార్ట్ ఫిలింకి ఆల్‌ ద బెస్ట్‌ లిటిల్‌ బ్రదర్‌. ఇది కేవలం ప్రారంభం మాత్రమే’ అని రకుల్‌ పోస్ట్‌ చేశారు. దీనికి ‘రాక్‌ అండ్‌ రోల్‌’ టైటిల్‌ను ఖరారు చేశారు. త్వరలో ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రచార చిత్రంలో ఉంది.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy