హీరోయిన్ కిడ్నాప్.. వేధింపులు

bhavanaమ‌లయాళ సినీ న‌టి భావ‌న లైంగిక వేధింపుల‌కు గురైంది. కేర‌ళ‌లోని ఎర్నాకుళం జిల్లాలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. శుక్ర‌వారం రాత్రి షూటింగ్ నుంచి ఇంటికి తిరిగివెళ్తున్న‌ స‌మ‌యంలో ఆమెను కిడ్నాప్ చేసి లైంగికంగా వేధించిన‌ట్లు తెలుస్తుంది. న‌టి భావ‌న కారును అడ్డ‌గించిన కొంద‌రు ఆమెను ఎత్తుకెళ్లారు. లైంగిక వేధింపుల‌కు గురిచేసి..  ఆ త‌ర్వాత బెదిరించారు. కారులోనే వేధించినట్లు చెబుతోంది ఈ హీరోయిన్. గంట సేపు కారులో తిప్పిన దుండ‌గులు ఆ త‌ర్వాత వ‌దిలిపెట్టారు. ఆ గ్యాంగ్.. హీరోయిన్ ఫోటోలు, వీడియోలు కూడా తీసిన‌ట్లు కంప్లయింట్ చేసింది. ఈ కేసులో భావ‌న మాజీ డ్రైవ‌ర్ మార్టిన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్ర‌ధాన నిందితుడు సునిల్ ప‌రారీలో ఉన్నాడు. గ‌తంలో ఈ ఇద్ద‌రూ భావనకు డ్రైవ‌ర్లుగా ప‌నిచేశారు. కిడ్నాప్‌తో పాటు లైంగిక వేధింపుల కేసును పోలీసులు న‌మోదు చేశారు. వేధింపుల‌కు గురైన హీరోయిన్ మొద‌ట డైరెక్ట‌ర్‌ను ఆశ్ర‌యించింది. ఆ డైరెక్ట‌ర్ ఫిర్యాదు మేరుకు పోలీసులు స్పాట్‌కు వ‌చ్చారు. తెలుగులో ఒంట‌రి, మ‌హాత్మ, హీరో, నిప్పు చిత్రాల్లో భావ‌న న‌టించింది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy