హీరోలా ఉన్నాడు.. కోట్ల ఆస్తి : ఆత్మహత్య చేసుకున్నాడు

mumbaiఅతడి పేరు పవన్ జీత్ కోహ్లీ. వయస్సు 24 ఏళ్లు. చూడటానికి హీరోలా ఉంటాడు. ఇంట్లో కూడా చాలా చలాకీ. చెడు అలవాట్లు కూడా లేవు. ఇదే ఆ తండ్రిని ఎంతో ఆనందానికి గురి చేసింది. మా అబ్బాయి సూపర్ సూపర్ అని అందరికీ చెప్పుకుని మురిసిపోయేవాడు. ఇటీవలే 24వ పుట్టిన రోజును పురస్కరించుకుని కోహ్లీకి ఆడి కారు గిఫ్ట్ గా ఇచ్చాడు తండ్రి. ఇంట్లోనే కాకుండా ఫ్రెండ్స్ తోనూ ఎప్పుడూ హ్యాపీగా ఉంటాడు. అలాంటి కుర్రోడు అనూహ్యంగా సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పారిశ్రామికవేత్తలు, హైఫై సర్కిల్ లో సంచలనం అయిన ఈ వార్త.. ముంబైలో ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

వివరాల్లోకి వెళితే.. పవన్ జీత్ కోహ్లీ ముంబై బాంద్రకి సమీపంలోని పాలీహిల్స్ లో నివాసం. తండ్రి ప్రముఖ వ్యాపారవేత్త. ఇటీవల ఓ అమ్మాయిని ప్రేమించాడు. రెండేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే అమ్మాయి కోహ్లీని కాదని.. ఇటీవలే మరొకరితో నిశ్చితార్థం చేసుకుంది. ఎంతో ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యిందన్న బాధ వెంటాడింది. ఈ బాధను మాత్రం ఎప్పుడూ.. ఎవరితోనూ బయటకు చెప్పలేదు. ఎప్పట్లాగే అందరితోనూ ఉండేవాడు. ఇంట్లోనూ ఎవరూ కోహ్లీ తీరును గమనించలేదు. ఫ్రెండ్స్ దగ్గర కూడా బయటపడలేదు. ఆదివారం రాత్రి క్యాబ్ బుక్ చేసుకున్నాడు. కొత్త కారు, తన ఫోన్ ఇంట్లోనే పెట్టేశాడు. బాంద్ర-వార్లీ సీలింక్ దగ్గరకు వెళ్లాడు. క్యాబ్ బ్రిడ్జి పైనుంచి వెళుతున్న సమయంలో.. వాంతు అవుతుందని కారు ఆపమని డ్రైవర్ కు చెప్పాడు. అతని కారు ఆపిన వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి సముద్రంలో దూకేశాడు. మంగళవారం ఉదయం అతని డెడ్ బాడీని ఒడ్డుకు కొట్టుకువచ్చింది.

ప్రేమించిన అమ్మాయికి నిశ్చితార్ధం కావటం వల్లే తనలో తానే కుమిలిపోయి ఆత్మహత్య చేసుకున్నట్లు విచారణ పోలీస్ ఆఫీసర్ వెల్లడించారు చనిపోవటానికి ఫాస్ట్ ట్రాక్ ఏంటీ అనే అంశాలపై మూడు రోజులుగా గూగుల్ సెర్చ్ చేసినట్లు అతని మొబైల్ చూస్తే తెలుస్తుందని తెలిపారు పోలీసులు. ఇంట్లో కుటుంబ సభ్యులు సైతం దీంతో షాక్ అయ్యారు. ఇంట్లో విషయం చెప్పినా జాగ్రత్తలు తీసుకునేవారమని అంటున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy