హీరో కాదు విలన్ : దిలీప్‌ అరెస్ట్ తో రూ.60కోట్లు నష్టం

Actor-Dileepమళయాళ ప్రముఖ సినీ నటి భావన కిడ్నాప్ కేసులో ప్రముఖ నటుడు దిలీప్‌కుమార్‌ను అరెస్ట్‌ చేశారు పోలీసులు. హీరో అరెస్ట్‌ తో మలయాళీ చిత్ర పరిశ్రమకు రూ.60 కోట్ల నష్టం వచ్చింది. దిలీప్‌ నటిస్తున్న చాలా సినిమాలు చిత్రీకరణ దశలోనే ఉన్నాయి. వాటి చిత్రీకరణ పూర్తయ్యే సమయానికి ఆయన అరెస్ట్‌ అవ్వడంతో కోట్లల్లో నష్టం వాటిల్లిందంటున్నారు మాలీవుడ్ సినీ ఇండస్ట్రీ.

దిలీప్‌కి మలయాళీ పరిశ్రమలో మోహన్‌లాల్‌, మమ్ముట్టిలకున్నంత పాపులారిటీ ఉంది. దిలీప్‌ నటించిన ‘రాంలీలా’ చిత్రం జులై 21న విడుదల కావాల్సి ఉంది. దిలీప్‌ను మలయాళీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ నుంచి కూడా తప్పించారు. అతని సినిమాలు విడుదల కానివ్వమంటూ ఆందోళనలు జరుగుతున్నాయి. దీంతో ‘రాంలీలా’ చిత్రం విడుదల వాయిదాపడింది. దిలీప్ అరెస్ట్ తో ఆయనతో సినిమాలు తీస్తున్న.. ఇప్పటికే పూర్తి చేసిన నిర్మాతలు ఆందోళనకు గురవుతున్నారు.

దిలీప్ అరెస్ట్ తో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు రూ.60 కోట్ల వరకు నష్టం రావొచ్చని అంచనా వేస్తున్నారు. హీరో తరపున ప్రముఖ లాయర్ కె.రామ్ కుమార్ బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటికిప్పుడు బెయిల్ వచ్చే పరిస్థితి లేదని కొందరు అంటున్నారు. జైల్లో ఎన్ని రోజులు అంటే.. అన్ని కోట్లు నష్టపోవాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిర్మాతలు. మిగతా ఆర్టిస్టుల కాల్షీట్లను సర్దుబాటు చేయాలంటే మరింత కష్టం అవుతుందని… ఇలాంటి పరిణామాలను మళయాళీ ఇండస్ట్రీలో చోటు చేసుకోవటం సిగ్గుచేటని సామాజిక కార్యకర్తలు అంటున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy