హీరో కావాలనే ఆశతో : ఇది వాపు కాదు బలుపు

b1అతి తక్కువ కాలంలోనే కండలతో స్టయిలిష్ గా కనిపించాలనుకున్నాడు. యూత్ కి ఐకాన్ కావాలని కలలు కన్నాడు. ఆ తర్వాత హీరో కావాలని ఆశ పడ్డాడు.. ఇందుకోసం చేసిన ప్రయత్నాలు వికటించి ప్రాణాలపైకి తెచ్చుకున్నాడు. వాపు కోసం కోసం చేసిన ప్రయోగాలు వికటించి.. చావుకి దగ్గరయ్యాడు. ఇప్పుడు బలుపు అంతా తగ్గి.. మామూలు మనిషిగా మారటానికి చికిత్స చేయించుకుంటున్నాడు. రష్యాలో ఓ యువకుడి కథ ఇప్పుడు యువతకు గుణపాఠంగా మారింది. వివరాల్లోకి వెళితే..

కిరిల్ తెరేషిన్ పాపాయ్ అనే 21 సంవత్సరాల రష్యా యువకుడికి యూత్ ఐకాన్ కావాలనే ఆశ ఉంది. అందుకు కండలు పెంచాలని నిర్ణయించారు. సహజంగా అయితే అందుకు సంవత్సరాలు పడుతుంది. అలా కాకుండా.. మజిల్ పవర్ చూపించటానికి ఇంజక్షన్స్ తీసుకున్నాడు. వీటిని కూడా ఇంటర్నెట్ చూసి స్వయంగా తయారు చేసుకున్నాడు. ఎందుకంటే ఆ ఇంజక్షన్స్ రష్యాలో నిషేధం. దీంతో మార్కెట్ లో దొరికే వివిధ రకాల మందులను కొనుగోలు చేసి.. వాటిని మిక్స్ చేసి ఇంజక్షన్ రూపంలో తీసుకున్నాడు. అంతే నెల రోజుల్లోనే శరీరంలో విపరీతమైన మార్పులు. కండలు తిరిగాయి. మజిల్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎంతలా అంటే.. ఒక్కో చేతి మజిల్.. తన తలకాయ సైజులోకి వచ్చాయి. అనుకున్నట్లుగానే అందరూ పొగడ్తలతో ముంచెత్తారు. హీరో అంటూ కీర్తించారు. అమ్మాయి కూడా మజిల్స్ చూసి వావ్.. బాప్ రే అంటూ వెంటపడ్డారు.

మూడు నెలల తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. వాపు అయితే అలాగే ఉందికానీ.. బలం తగ్గిపోతుంది. పటుత్వం కోల్పోతున్నాడు. వెంటనే ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు. డాక్టర్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కిరిల్ తెరేషిన్ తీసుకున్న మందులన్నింటినీ పరీక్షించారు. చికిత్స మొదలుపెట్టారు. ఈ యువకుడు తీసుకున్న ఇంజక్షన్ వల్ల చర్మం వ్యాధితోపాటు పక్షవాతం వచ్చే లక్షణాలు ఉన్నాయని చెబుతున్నారు.

కేవలం ఫేమస్ కావటం కోసమే ఈ పని చేశానని.. ఇలా ప్రాణాలపైకి వస్తుందని అనుకోలేదని ఇప్పుడు పశ్చాత్తాపం పడుతున్నాడు. సోషల్ మీడియాలో హీరో కావాలని ఆశ కూడా ఉందని.. మిలియన్ల ఫాలోవర్స్ తో గొప్పోడిగా, హీరోలా మారాలనే తపనే కొంప ముంచింది అంటున్నాడు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy